మరో సీనియర్ హీరో సినిమాలో.. ఛాన్స్ కొట్టేసిన త్రిష?

praveen
హీరోయిన్ త్రిష గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తే అది అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా హవా నడిపించింది. ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలు అందరితో కలిసి నటించి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది అని చెప్పాలి. అయితే ఆ తర్వాత కాలంలో మాత్రం కోలీవుడ్ లో వరుసగా అవకాశాలు రావడంతో టాలీవుడ్ కి పూర్తిగా దూరమైపోయింది త్రిష. ఇక ఇప్పుడు సీనియర్ హీరోయిన్ అనే ముద్ర పడినప్పటికీ వరుసగా చాన్సులు దక్కించుకుంటూనే ఉంది అన్న విషయం తెలిసిందే.

 చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చినందుకు సిద్ధమవుతుంది త్రిష. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభరా సినిమాతో టాలీవుడ్లోకి రాబోతుంది అని చెప్పాలి. అయితే ఇక ఇలా మెగాస్టార్ తో సినిమాను ఓకే చేసిందో లేదో త్రిష కు మరిన్ని తెలుగు ఆఫర్స్ కూడా క్యూ కడుతున్నాయి అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇక మరో సీనియర్ హీరో సినిమాలో కూడా త్రిష నటించబోతుందట. ఇక ఇందుకు సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. ఈ ఏడాది సంక్రాంతికి సైంధవ్ అనే ఒక యాక్షన్ త్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సీనియర్ హీరో వెంకటేష్.

 ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేయబోతున్నాడు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు వీరి కాంబినేషన్లో రాబోతున్న మూడో సినిమాపై కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీలో వెంకీ సరసన త్రిషను హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. త్రిష తో ఇప్పటికే చిత్ర బృందం సంప్రదింపులు కూడా జరిపారట. అయితే ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నది తెలుస్తుంది. అయితే వెంకీ త్రిష కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. ఆడి వారి మాటలకు అర్ధాలే వేరులే, బాడీగార్డ్, నమో వెంకటేశాయా లాంటి సినిమాలు వచ్చి మంచి విజయాలను సాధించగా.. ఇక ఇప్పుడూ నాలుగోసారి ఈ కాంబినేషన్ ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: