స్టార్ హీరో సినిమాలను దాటేసిన పాయల్ మంగళవారం మూవీ..!?

Anilkumar
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఈ మధ్య కాలంలో కొన్ని క్రేజీ సినిమాలు వచ్చాయి. అందులో డిఫరెంట్ కాన్సెప్టుతో తెరకెక్కిన చిత్రాలు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాయి. వాటిలోనూ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన సినిమాలు మరింతగా సక్సెస్ అయ్యాయి. అలా కొద్ది రోజుల క్రితమే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రేజీ సినిమానే 'మంగళవారం'. ఇండియాలోనే ఏ భాషలోనూ టచ్ చేయని కాన్సెప్టుతో రూపొందిన 'మంగళవారం' మూవీకి ప్రీమియర్స్ నుంచే అదిరిపోయే టాక్ వచ్చింది. ఆ తర్వాత కూడా ఇదే కంటిన్యూ అయింది. 

అందుకు తగ్గట్లుగానే దీనికి మంచి ఓపెనింగ్స్ వచ్చినా.. ఆ తర్వాత మాత్రం క్రమంగా డౌన్ అవుతూ వచ్చాయి. అయినప్పటికీ మంచి వసూళ్లతోనే ఈ సినిమా రన్‌ను ముగించుకుంది. అయితే టాలీవుడ్ బోల్డు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి తెరకెక్కించిన 'మంగళవారం' సినిమాపై అంచనాలు ఏర్పడడడంతో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ  ఇండియాలోనే ఏ భాషలోనూ టచ్ చేయని కాన్సెప్టుతో రూపొందిన 'మంగళవారం'  రైట్స్‌ను కొనుగోలు చేసింది. ఇందుకోసం సదరు సంస్థ చిత్ర నిర్మాతలకు భారీ మొత్తాన్నే చెల్లించినట్లు తెలిసింది. 

మంగళవారం మూవీకి అర్బన్ ఏరియాలో 7.21 టీఆర్‌పీ రేటింగ్ రాగా...అర్బన్, రూరల్ కలిపి 6.51 టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. బోల్డ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి బుల్లితెరపై అంతగా రెస్సాన్స్ రాదని టీవీ వర్గాలు అనుకున్నాయి. కానీ వారి అంచనాలను మించి టీవీల్లో  ఇండియాలోనే ఏ భాషలోనూ టచ్ చేయని కాన్సెప్టుతో రూపొందిన 'మంగళవారం'  సినిమా హిట్టయింది. రీసెంట్‌గా స్టార్‌లో టెలికాస్ట్ అయిన సినిమాల్లో హయ్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌ను దక్కించుకున్న మూవీగా మంగళవారం నిలిచింది. దళపతి విజయ్ లియో, పవన్ కళ్యాణ్ బ్రో కంటే మంగళవారం సినిమా ఎక్కువగా టీఆర్‌పీ రేటింగ్ దక్కించుకున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: