ఎల్లో శారీలో పూజ హెగ్డే అందాలు.. ఫిక్స్ వైరల్..!

Anilkumar
పూజా హెగ్డే గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో పూజా హాట్ టాపిక్ గా మారుతోంది. సౌత్ లో పూజా అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు. పూజా హెగ్డే క్యూట్ లుక్, సెక్సీ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి. సోషల్  మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది.  వరుసగా సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ అమ్మడుకు ప్రస్తుతం కాలం కలిసిరావడంలేదు. దురదృష్టం వెంటాడుతోందని చెప్పొచ్చు. 

గతేడాది వరుసగా నాలుగు డిజాస్టర్లు చవిచూడటంతో నిర్మాత, దర్శకులు, హీరోలు అమ్మడును దూరం పెట్టడం ప్రారంభించారు. సినిమా అవకాశాలు రావడంలేదని బాధపడుతున్న తరుణంలోనే గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా బుట్టబొమ్మ నుంచి దూరమయ్యాయి. నాగచైతన్య సరసన ఒక లైలాకోసం సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయిన ఈ భామ ముకుంద సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత హృతిక్ రోషన్ సరసన మొహంజదారో సినిమాలో అవకాశం రావడంతో బాలీవుడ్ ను ఏలడానికి టాలీవుడ్ ను వదిలివెళ్లింది  వరుసగా సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన పూజా హెగ్డే  . 

అయితే ఆ సినిమా ఫ్లాప్ కావడంతో గోడకు కొట్టిన బంతిలా మళ్లీ తిరిగివచ్చింది. తాజాగా  వరుసగా సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తెలుగుదనం ఉట్టిపడేలా మంత్రముగ్ధులను చేసింది. ఎల్లో చీరకట్టులో అందమైన బుట్టబొమ్మలా, నుదుటిపై పెద్ద బొట్టు, మెడలో అలంకరించే ఆకుపచ్చ హారము, జుట్టులో మల్లెపూల క్యాస్కేడ్ ఆకట్టుకుంది. పసుపు కోకా బ్లౌజ్‌తో మ్యాచింగ్ దుస్తులతో ఆకట్టుకుంది. ఈ అందాల బ్యూటీని చూసేందుకు రెండు కళ్లు సరిపోవడం లేదు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కుర్రకారును ఇట్టే ఆకట్టుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: