రాజమౌళి మహేష్ టైటిల్ అదేనా..!

shami
గుంటూరు కారం తర్వాత మహేష్ రాజమౌళి డైరెక్షన్లో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారని తెలిసిందే. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు 300 కోట్ల పైన బడ్జెట్ తో వస్తుందని తెలుస్తుంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాజమౌళి ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో చేస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పటికే టెక్నీషియన్స్ ని హాలీవుడ్ నుండి దించుతున్నాడని తెలిసింది.
ఇక లేటెస్ట్ గా సినిమాకు అదిరిపోయే టైటు లాక్ చేశారట. మహేష్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే టైటిల్ ని ఈ సినిమాకి పెడుతున్నట్టు తెలుస్తుంది. ఇంతకీ రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా టైటిల్ ఏంటంటే మహారాజా అని అంటున్నారు. ఈ భారీ కాంబినేషన్ కి ఏ మాత్రం తగ్గని విధంగా టైటిల్ ఉందని చెప్పవచ్చు. మహేష్ మహారాజ ఈ టైటిల్ కి సూపర్ అనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ తనని తాను మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు.
మార్చ్ నుండి 6 నెలలు వర్క్ షాప్ ఏర్పాటు చేస్తున్న రాజమౌళి త్వరలోనే సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఈ సినిమాను రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి అనుకున్న విధంగా అనుకున్న టైం కి రిలీజ్ చేయాలని ప్లాన్. మహేష్ రాజమౌళి కాంబినేషన్ అంటేనే ఆడియన్స్ లో సూపర్ కిక్. తప్పకుండా ఈ సినిమా పాత ఇండియా కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్రభావం చూపిస్తుందని చెప్పొచ్చు. సినిమాలో మిగతా కాస్టింగ్  ఏంటి సినిమా ఎప్పుడు మొదలవుతుంది లాంటి డీటెయిల్స్ త్వరలో బయటకు రానున్నాయి. ఈ సినిమాలో ఇండోనేషియా బ్యూటీ ని హీరోయిన్ గా తీసుకున్నారని టాక్. అయితే మహేష్ సినిమా విషయంలో ప్రతీది రాజమౌళి భారీ ప్లానింగ్ తో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రేజీ కాంబో తప్పకుండా ఇంటర్నేషనల్ లెవెల్ లో సంచలనాలు సృష్టించడం పక్కా అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: