RC16.. వరల్డ్ వైడ్ ట్రీట్ పక్కా అంటున్న మేకర్స్..!

shami
రాం చరణ్ బుచ్చి బాబు కాంబినేషన్ లో వస్తున్న ఆర్సీ 16 సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ మెగా ఫ్యాన్స్ ని థ్రిల్ చేస్తుంది. ఆర్.ఆర్.ఆర్ తో గ్లోబల్ లెవెల్ లో స్టార్ డం తెచ్చుకున్న చరణ్ ప్రస్తుతం గేం చేంజర్ సినిమా చేస్తున్నాడు. శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా ఎలాగు హిట్ టార్గెట్ పక్కా అని ఫిక్స్ అయ్యారు. ఇక ఆ నెక్స్ట్ బుచ్చి బాబుతో చేస్తున్న సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని అర్ధమవుతుంది. ఉప్పెనతో ఫస్ట్ సినిమాతోనే తన డైరెక్షన్ టాలెంట్ చూపించిన బుచ్చి బాబు ఆర్సీ 16తో అదరగొట్టబోతున్నాడు.
ఇక ఈ సినిమా గురించి మేకర్స్ ఇచ్చిన హింట్ ఏంటంటే ఆర్సీ 16 వరల్డ్ వైడ్ గా ట్రీట్ ఇవ్వబోతుందని అంటున్నారు. సినిమా యూనివర్సల్ కాన్సెప్ట్ తో వస్తుంది కాబట్టి వరల్డ్ వైడ్ గా ఆర్సీ 16 అదరగొట్టేయడం పక్కా అంటున్నారు. బుచ్చి బాబు బర్త్ డే సందర్భంగా చరణ్ సినిమా వరల్డ్ వైడ్ అంటూ ఫైర్ సింబల్ వేశారు. సో సినిమా కేవలం పాన్ ఇండియానే కాదు పాన్ వరల్డ్ రిలీజ్ అవుతుందని తెలుస్తుంది.
ఈ సినిమాలో హీరోయిన్ మిగతా కాస్టింగ్ అఫీషియల్ గా బయటకు రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుందని టాక్. గేం చేంజర్ పూర్తి చేయడమే ఆలస్యం చరణ్ బుచ్చి బాబు సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది. మరి బుచ్చి బాబు చరణ్ కాంబో సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఆర్సీ 16 సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని టాక్. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఓ రేంజ్ లో నిర్మిస్తున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: