SSMB29: మహేష్ కోసం సూపర్ టెక్నికల్ టీం?

Purushottham Vinay
ఇండియన్ టాప్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. “RRR” వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి చిత్రీకరిస్తున్న ఈ సినిమా కోసం దేశం మాత్రమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఎంతగానో ఎదురుచూస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇండోనేషియాకి చెందిన నటి ఈ మూవీలో హీరోయిన్ గా నటించబోతున్నట్లు వార్తలు రావటం జరిగాయి. ఇంటర్నేషనల్ లెవెల్ లో చేస్తున్న సినిమా కావటంతో విదేశీ నటులు ఉండాలని ఇండోనేషియా కు చెందిన ప్రముఖ నటి చీల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ నీ రాజమౌళి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికాలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ ఇండోనేషియా సినిమాలలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.ఈ 28 ఏళ్ల హాట్ బ్యూటీని మన సూపర్ స్టార్ మహేష్ కి జోడిగా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా ఈ మూవీకి సంబంధించి పేర్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.


ఈ మూవీకి ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందిస్తున్న సంగతి తెలిసిందే.అలాగే ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడని కూడా అందరికీ తెలుసు. ఇక మిగతా టీం వివరాలు చూసుకుంటే…సినిమాటోగ్రాఫర్ గా వినోద్, VFX సూపర్ వైజర్ కమల్ కన్నన్, ప్రొడక్షన్ డిజైనర్ గా మోహన్ బింగి, ఎడిటర్ తమ్మిరాజు రంగంలోకి దిగినట్లు సమాచారం తెలుస్తుంది. ఇక యధావిధిగా కాస్ట్యూమ్ డిజైనర్ గా రాజమౌళి భార్య అయిన రమా రాజమౌళి పని చేయనున్నారట.రీసెంట్ గా జర్మనీ వంటి దేశాలలో కీలకమైన అడవులలో మహేష్ పర్యటించారు. ప్రస్తుతం రాజమౌళి నిర్వహిస్తున్న వర్క్ షాప్ లలో కూడా పాల్గొంటున్నారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ అడ్వెంచర్ తరహాలో ఈ సినిమా ఉండబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది. దీంతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటి దాకా ప్రేక్షకులు చూడని యాక్షన్ అడ్వెంచర్ సన్నివేశాలు ఈ మూవీలో ఉండేలా రాజమౌళి ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీలో సమాచారం వినిపిస్తోంది.ఇక మార్చి నెలలో అధికారిక ప్రకటన చేసి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: