"ఎన్బికె109" కి సంబంధించి ఆ విషయంలో ఇప్పటికీ నో క్లారిటీ..?

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ కి ఇప్పటి వరకు ఈ మూవీ మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమా బాలయ్య కెరియర్ లో 109 వ సినిమాగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ బృందం "ఎన్ బి కే 109" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ ను తెరకెక్కిస్తూ వస్తుంది.

ఇకపోతే మొదటి నుండి ఈ మూవీ లో బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్ లు ఉండబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో నిజంగానే బాలకృష్ణ సరసన ఇద్దరు హీరోయిన్ లు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా ఊర్వశి రౌటేలా నీ ఎంపిక చేసుకుంది. ఈమెపై కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించింది.

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తి కాగా ఈ మూవీ లో బాలకృష్ణ సరసన నటించబోయే ఇంకో ముద్దు గుమ్మ గురించే చిత్ర బృందం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. మరి ఈ సినిమా బృందం ఈ మూవీ లో మరో హీరోయిన్ గా ఏ ముద్దుగుమ్మను సెలెక్ట్ చేసుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత బాబీ దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడం ... వరస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య ఈ సినిమాలో హీరో గా నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: