ఈగల్ 2 ఛాన్స్ ఉందా.. రిస్క్ చేస్తారా..?

shami
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈగల్ సినిమా శుక్రవారం రిలీజైంది. ఈ సినిమా చూసిన వారంతా యాక్షన్ పాళ్లు బాగున్నా సినిమా కథ అంతగా మెప్పించలేదని అంటున్నారు. కేవలం స్టైలిష్ యాక్షన్ కోసం ఈ సినిమా ఒకసారి చూసేయొచ్చని చెబుతున్నారు. అయితే ఈగల్ సినిమా చివర్లో ట్విస్ట్ ఇస్తూ సీక్వెల్ ని అనౌన్స్ చేశారు మేకర్స్.
ఈగల్ కి సీక్వెల్ అని ప్రకటించగానే ఆడియన్స్ అంతా షాక్ అయ్యారు. ఈగల్ 2 టైటిల్ కూడా యుద్ధ కాండ అని పెట్టారు. అయితే ఈగల్ కి వచ్చిన ఈ రెస్పాన్స్ చూశాక నిర్మాతలు పార్ట్ 2 సాహసం చేస్తారని అనుకోలేం. 21 కోట్ల బిజినెస్ తో రిలీజైన ఈగల్ సినిమా ఫస్ట్ డే రవితేజ స్టామినా చూపించేలా 4 కోట్ల దాకా షేర్ రాబట్టింది.
మాస్ రాజా సినిమా హిట్ టాక్ వస్తే మాత్రం అందరు ఆడియన్స్ సినిమా చూసే అవకాశం ఉంటుంది. అయితే సినిమా డివైడ్ టాక్ వస్తే మాత్రం కష్టం. ఈగల్ సినిమాకు టాక్ అంత బాగా రాలేదు మరి ఆడియన్స్ సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తారా.. సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా అన్నది సోమవారం కల్లా తెలుస్తుంది. ఏదైనా సినిమా హిట్ అయితేనే దాన్ని సీక్వెల్ చేస్తారు.

బాహుబలి, కె.జి.ఎఫ్ లు కథలు సీక్వెల్ లా రాసుకున్నారు అలా తీశారు. మరి ఈగల్ కథ పూర్తి చేశారు. మరి ఈగల్ 2 యుద్ధ కాండ పై తర్వాత అప్డేట్ ఏంటన్నది చూడాలి. ధమాకా తర్వాత రవితేజ వాల్తేరు వీరయ్య హిట్ అయినా ఆ తర్వాత రెండు ఫ్లాపులు పడ్డాయి. అయితే ఈగల్ ఫస్ట్ డె వసూళ్లు పర్వాలేదు అనిపించినా సినిమా హిట్ అనిపించుకునే కలెక్షన్స్ వస్తాయా లేదా అన్నది చూసి డిసైడ్ చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: