రాజమౌళి సినిమా రికార్డును బ్రేక్ చేసిన.. సందీప్ వంగా మూవీ?

praveen
ఇటీవల కాలంలో సందీప్ రెడ్డి తన సినిమాలతో ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ లాంటి చిన్న హీరోతో అర్జున్ రెడ్డి అనే సినిమాను తీసి ఎంతలా సెన్సేషన్ విజయాన్ని సొంతం చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ మూవీ తో టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సృష్టించాడు. అయితే ఇదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ అనే పేరుతో రీమేక్ చేసి అక్కడ బ్లాక్ బస్టర్ కొట్టాడు. అయితే ఈ రెండు మూవీస్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సందీప్ రెడ్డి వంగ.. ఇటీవల యానిమల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

 బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా.. ఎంత సూపర్ డూపర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీలో రణబీర్ కపూర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. అయితే ఇక ఈ సినిమా విడుదలై దాదాపు 700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి.. బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. అయితే ఇక ఇప్పుడు ఓటీటిలో రిలీజ్ అయిన తర్వాత కూడా యానిమల్ సినిమా సత్తా చాటుతూ ఉంది అని చెప్పాలి. ఒకవైపు ఈ సినిమా పై విమర్శలు వస్తున్న మరోవైపు సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల ఏకంగా జక్కన్న మూవీ రికార్డును బద్దలు కొట్టేసింది యానిమల్ మూవీ.

 రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ మూవీ ఓటిటిలో విడుదలైన తొలి రోజుల్లోనే 3.93 కోట్ల గంటల వ్యూయర్షిప్ సొంతం చేసుకుంది అని చెప్పాలి. దీంతో ఆల్ టైం అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియన్ మూవీ గా కూడా అరుదైన రికార్డును సృష్టించింది. గతంలో ఈ రికార్డు త్రిబుల్ ఆర్ పేరిట ఉండేది. ఓటీటిలో విడుదలైన కేవలం పది రోజుల్లోనే 2.5 కోట్ల గంటల వ్యూయర్షిప్ సాధించింది త్రిబుల్ ఆర్.  అయితే షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాకు కూడా ఇదే స్థాయిలో వ్యూయర్షిప్ వచ్చింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ రెండు సినిమాల రికార్డును బద్దలు కొట్టింది యానిమల్ మూవీ. అయితే ఓటీటిలో రిలీజ్ అయిన యానిమల్ మూవీలో కొన్ని కొత్త సన్నివేశాలు యాడ్ చేయడంతో ఇప్పటికే థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ఓటీటిలో మళ్ళీ చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: