'హనుమాన్' కోసం 75 సినిమాలను వదులుకున్నా - తేజా సజ్జా!

Anilkumar
తేజ సజ్జా హీరోగా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'హనుమాన్' ఈ సంక్రాంతికి జనవరి 12 న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు సంక్రాంతి బరిలో గుంటూరు కారం, సైంధవ్, నా స్వామి రంగ వంటి సినిమాలు విడుదలైనా వాటన్నిటిలో 'హనుమాన్' యునానిమస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సౌత్, నార్త్, ఓవర్సీస్.. అనే తేడా లేకుండా విడుదలైన అన్నిచోట్ల రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. సినిమా విడుదలై సుమారు 23 రోజులు అవుతున్నా ఇంకా బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ ర్యాంపేజ్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 290 కోట్లకు పైగా గ్రాస్ సాధించి ఎన్నో రికార్డ్స్ ని బ్రేక్ చేసింది.

 ఇక ఈ సినిమాతో దర్శకుడిగా ప్రశాంత్ వర్మకి.. హీరోగా తేజా సజ్జాకి.. దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ వచ్చింది. హనుమాన్ సక్సెస్ తో తేజా టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. ప్రస్తుతం ఈ హీరోకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తేజ సజ్జ తాజా ఇంటర్వ్యూలో 'హనుమాన్' సినిమా కోసం తను చేసిన త్యాగాలను బయటపెట్టాడు. 'హనుమాన్' సినిమా కోసం రెండున్నరేళ్లు కష్టపడ్డ తేజ సజ్జా ఆ సమయంలో ఏకంగా 70 నుంచి 75 సినిమాలను వదులుకున్నట్లు తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు." హనుమాన్ కోసం నేను సుమారు 25 లుక్ టెస్టులు ఇచ్చాను. సాధారణంగా ఓ సినిమా కోసం ఏ నటుడైనా రెండు, మూడు టెస్టులు మాత్రమే ఇస్తారు.

ఈ మూవీలో స్టంట్స్ అన్నీ నేనే చేశాను. బాడీ డబుల్ లేదా వీఎఫ్ఎక్స్ ఉపయోగించలేదు. స్కూబా డైవింగ్ నేర్చుకొని మరీ నీటి లోపల సీక్వెన్స్ షూట్ చేశాను. హనుమాన్ మూవీ బాక్సాఫీస్ నంబర్లను నేను ఎప్పుడూ పట్టించుకోలేదు, ఈ సినిమా ఆడియెన్స్ కు నచ్చిందా లేదా అన్నదే చూశాను" అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో తేజ సజ్జ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. హనుమాన్ ఓవర్సీస్ లో భారీ సక్సెస్ అందుకోవడంతో ప్రస్తుతం తేజ సజ్జాతోపాటు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ఫిమేల్ లీడ్ అమృతా అయ్యర్ అమెరికాలో ఈ మూవీ ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: