యశ్ 'టాక్సిక్' లో - ఆ బాలీవుడ్ హీరో క్యామియో రోల్

Anilkumar
కేజీఎఫ్' సిరీస్ తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న కన్నడ రాకింగ్ స్టార్ యష్ తన కొత్త సినిమాలు ప్రకటించేందుకు దాదాపు ఏడాదిన్నర టైం తీసుకున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్ రావడంతో తొందరపడి సినిమాలు చేయకుండా తన విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ఇటీవల గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో తన కొత్త సినిమాను ప్రకటించాడు. 'టాక్సిక్' అనే వెరైటీ టైటిల్ తో తెరక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. గ్లోబల్ డ్రగ్ మాఫి అనే పద్యంలో రూపొందునున్న ఈ సినిమాలో యశ్ గ్రే షేడ్స్ ఉండే క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో క్యామియో రోల్ చేస్తున్నట్లు సమాచారం.
యశ్ 'టాక్సిక్' మూవీకి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ సర్క్యులేట్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ క్యామియో రోల్ చేస్తున్నారట. 'టాక్సిక్' మూవీ టీమ్ సినిమాలో ఓ ఎక్స్ టెండేడ్ క్యామియో రోల్ కోసం ఇటీవల షారుక్ ఖాన్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే షారుక్ మాత్రం ప్రస్తుతానికి ఈ ప్రపోజల్ ని పెండింగ్ లో పెట్టినట్లు చెబుతున్నారు. కానీ మూవీ టీం ఎలాగైనా ఈ ప్రాజెక్టులో షారుక్ ఖాన్ ని నటింపజేయాలని చూస్తున్నారట. త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ యశ్ మూవీలో క్యామియో రోల్ చేసేందుకు షారుక్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ ప్రాజెక్టుకి నార్త్ లోను భారీ బజ్ వచ్చే అవకాశం ఉంది.
యశ్ కెరియర్ లో 19వ ప్రాజెక్ట్ అయిన 'టాక్సిక్' కోసం బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ తో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ ని మూవీ టీం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాతోనే కరీనాకపూర్ సౌత్ లోకి ఆరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు ప్రధాన పాత్రలు ఉండడంతో ఆ పాత్రల కోసం కరీనాకపూర్, శృతిహాసన్, సాయి పల్లవి లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే మేకర్స్ నుంచి ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: