మలయాళ హీరోయిన్ కి ప్రభాస్ ఇంటి భోజనం!

Anilkumar
సలార్ సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న ప్రభాస్ తన తదుపరి చిత్రంగా 'కల్కి 2898AD' మూవీలో నటిస్తున్నాడు. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో లోక‌నాయ‌కుడు కమల్‌ హాసన్‌ విల‌న్‌గా క‌నిపించ‌నుండ‌గా దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. హిందూ మైథలాజి కథతో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. వేసవి కానుకగా మే 9న ఈ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇటీవలే ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ యాడ్ అవుతున్నారు. కమల్, అమితాబ్ లతోపాటు దర్శక ధీరుడు రాజమౌళి,

దగ్గుబాటి రానా, మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌, విజయ్ దేవరకొండ ఈ సినిమాలో గెస్ట్‌రోల్‌స్ లో కనిపిస్తున్నట్లుగా వార్తలు వినిపించాయి. ఇక ఇదే సినిమాలో మలయాళ హీరోయిన్ అన్నా బెన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయాన్ని అన్నా బెన్ స్వయంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ జూమ్ కాల్ ద్వారా తనకు కల్కి లో ఆఫర్ ఇచ్చారని తన ఆనందాన్ని వ్యక్తపరిచింది. అంతేకాకుండా కల్కి సెట్స్ లో వడ్డించే తెలుగు వంటకాల గురించి ఎంతో ఇష్టంగా మాట్లాడుతూ.. ప్రభాస్ ఇంటి నుంచి తనకు ఫుడ్ వచ్చిందని తెలిపింది." ఇప్పటివరకు ప్రభాస్ ని పర్సనల్ గా కలవలేదు. కానీ నా కోసం ఆయన ఫుడ్ పంపిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.

ఆ ఫుడ్ ని ఎంతో ఇష్టంగా తిన్నాను. త్వరలోనే పర్సనల్ గా ఆయన్ని కలవాలని అనుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ స్టాండర్డ్స్ తో ఈ సినిమాను తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో ప్రభాస్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నారు త్వరలోనే టీజర్ కూడా రిలీజ్ కాబోతోంది. డైరెక్టర్ నాగ అశ్విన్ ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: