ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కల్కి మూవీ షూటింగ్ అక్కడే..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గత ఎడాది సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు  అలాంటిది ప్రభాస్ నుండి మరొక సినిమా రాబోతోంది అంటే ఆ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. అలా ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా కల్కి. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సైన్స్ ఫ్రిక్షన్ జాలర్ లో వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాని షేక్ చేశాయి. దాంతోపాటు టీజర్ మిలియన్ల సంఖ్యలో  వ్యూస్ సైతం సాధించి అందరికి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన మరొక 

వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమాను 2024 మే 9న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేసారు మేకర్స్. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో వచ్చి ట్రెండ్‌ సెట్టర్స్‌గా నిలిచిన జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి సినిమాలు విడుదలైన రోజే ఈ సినిమా కూడా వస్తుండటంతో సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ అవుతోంది. తాజా అప్‌డేట్ ప్రకారం రామోజీ ఫిలిం సిటీలో కీ షెడ్యూల్‌ నేడు మొదలుపెట్టబోతున్నారు. కీలక నటీనటులపై వచ్చే సీన్లను షూట్‌ చేయనుండగా.. త్వరలోనే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్   ప్రభాస్‌ సెట్స్‌లో జాయిన్ కానున్నాడట. 

 పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్   ప్రభాస్‌ మరోవైపు మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్‌ సినిమాలో కూడా నటిస్తున్నాడని తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్‌ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన కల్కి 2898 ఏడీ రైడర్స్‌ (యూనిఫార్మ్‌డ్‌ విలన్‌ ఆర్మీ) కాస్ట్యూమ్స్‌ మేకింగ్‌, అసెంబ్లింగ్‌ వీడియో సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ మూవీని వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై సీ అశ్వనీదత్‌ సుమారు 500 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: