'విశ్వంభర' లో కోలీవుడ్ స్టార్

Anilkumar
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'విశ్వంభర' లో కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తాజా సమాచారం. సినిమాలో శింబు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతి, ఆర్య వంటి హీరోలు తెలుగు సినిమాల్లో విలన్ గా మెప్పించారు. అల్లు అర్జున్ నటించిన 'వరుడు' సినిమాలో ఆర్య విలన్ గా అదరగొట్టగా.. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన 'ఉప్పెన' లో విజయ్ సేతుపతి కూడా నెగిటివ్ రోల్ లో మెప్పించారు. ఇక ఇప్పుడు శింబు కూడా మెగాస్టార్ 'విశ్వంభర' లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు చెబుతున్నారు.

అయితే శింబు ఇందులో మెయిన్ విలన్ గా చేస్తున్నారా? లేక నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నారా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.'విశ్వంభర' సినిమాని మొదలుపెట్టి చాలా రోజులు అవుతోంది. ఇటీవల ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. కాకపోతే ఆ షెడ్యూల్ లో చిరంజీవి పాల్గొనలేదు. ఇక తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి మొదటి వారంలో చిరంజీవి 'విశ్వంభర' షూటింగ్లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో చిరంజీవి, హీరోయిన్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటివరకు సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై మూవీటీమ్ క్లారిటీ ఇవ్వలేదు.

గత కొద్ది రోజులుగా ఇందులో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలోనే హీరోయిన్ విషయమై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది.'విశ్వంభర' ఓవర్సీస్ రైట్స్ 18 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ మొత్తంలో ఓ సినిమాకు ఓవర్సీస్ హక్కుల ద్వారా ఇంత మొత్తం రావడం ఇదే మొదటిసారి. సీనియర్ హీరోలలో రూ.15 కోట్లకు పైగా ఓవర్సీస్ రైట్స్ అమ్ముడవ్వడం ఇప్పటివరకు జరగలేదు. ఇది కేవలం మెగాస్టార్ సినిమాకి మాత్రమే సాధ్యమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: