'పుష్ప 2'.. పోస్ట్ పోన్ కోసం ఎదురుచూస్తున్న సినిమాలు

Anilkumar
ఈ ఏడాది టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా 'పుష్ప 2' తెరకెక్కుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప పార్ట్-1 కి అనూహ్య రీతిలో రెస్పాన్స్ రావడంతో దీనికి సీక్వెల్ గా వస్తున్న 'పుష్ప 2' పై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే మేకర్స్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయితే ఈ మధ్యకాలంలో 'పుష్ప 2' రిలీజ్ వాయిదా పడనున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో వార్తలు హల్చల్ చేశాయి.

కానీ 'పుష్ప 2' రిలీజ్ లో ఎలాంటి మార్పు లేదని ఈ మూవీ టీం తాజాగా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేసింది. ఇక్కడే అసలు సమస్య మొదలయింది. అదేంటంటే, 'పుష్ప 2' కనుక పోస్ట్ పోన్ అయితే దాదాపు ఆరు సినిమాలకు లైన్ క్లియర్ అవుతుంది. ఈ సినిమాని ఆగస్టు నుంచి పోస్ట్ పోన్ చేస్తే ఆ నెలలో కమల్ హాసన్ 'ఇండియన్ 2', సూర్య కంగువ, రజనీకాంత్ 'వెటయాన్', ఎన్టీఆర్ 'దేవర', నాని 'సరిపోదా శనివారం', అజయ్ దేవగన్ 'సింగం అగైన్' వంటి సినిమాలు థియేటర్స్ లోకి రావాలని చూస్తున్నాయి. 'పుష్ప 2' కోసం టాలీవుడ్ లోనే కాదు అన్ని భాషల ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అందుకే ఈ సినిమా పోస్ట్ పోన్ అయితే తెలుగుతోపాటు తమిళ, హిందీ సినిమాలు సైతం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నాయి. కానీ మూవీ టీమ్ ఏమో ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసేది లేదని, ఆగస్టు 15 కే సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఒకవేళ చెప్పినట్లుగానే 'పుష్ప2' ఆగస్టు 15న రిలీజ్ అయితే పైన పేర్కొన్న సినిమాల్లో ఏదో ఒక సినిమాకి 'పుష్ప 2'తో పోటీ పడక తప్పదు. ఒకవేళ అదే జరిగితే 'పుష్ప 2' సదరు సినిమా కలెక్షన్స్ పై భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో 'పుష్ప 2' మేకర్స్ మనసు మార్చుకుని ఆగస్టు నుంచి తప్పుకొని మిగతా సినిమాలకు ఛాన్స్ ఇస్తారా? లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: