ఆ గట్టున సినిమా స్టార్స్.. ఈ గట్టున రియల్ స్టార్స్.. వైసీపీకి స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 72 గంటల్లో  ఎన్నికలు జరగబోతున్నాయి. మెజారిటీ సర్వేలు వైసీపీకే అనుకూలంగా ఉండగా రాష్ట్రంలో వైసీపీకి అధికారం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 88 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉండగా సులువుగానే వైసీపీ మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేసి మళ్లీ అధికారంలోకి వస్తుందని వైసీపీ అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం.
 
అయితే ఎన్నికల్లో సినిమా స్టార్స్ అంతా కూటమికి ప్రచారం చేస్తుండగా తమ పథకాల ప్రయోజనాలు పొందిన వాళ్లే తమకు స్టార్ క్యాంపెయినర్లు అని వైసీపీ చెబుతోంది. ఈ ఎన్నికల్లో కూటమి తరపున హిందూపురం నుంచి బాలయ్య, పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తున్నారు. పవన్ ను గెలిపించడం కోసం వరుణ్ తేజ్, సాయితేజ్, జబర్దస్త్ కమెడియన్లు హైపర్ ఆది, గెటప్ శ్రీను, నిర్మాత నాగవంశీ ప్రచారం చేస్తున్నారు. చిరంజీవి సైతం పవన్ ను సపోర్ట్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు.
 
వైసీపీ తరపున ఒకరిద్దరు సినీ సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్నా ప్రస్తుతం లైమ్ లైట్ లో ఉన్న సెలబ్రిటీలు ఎవరూ పని చేయడం లేదు. అయితే ఓటర్లే ప్రచార సారథులు అని జగన్, వైసీపీ నేతలు చెబుతున్నారు. ఏపీలోని చాలా ప్రాంతాలలో వైసీపీ నుంచి లబ్ధి పొందిన మహిళలు పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో పథకాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొని వైసీపీ పాలనలో బెనిఫిట్స్ పొందిన వాళ్లు జగన్ కు మద్దతు ఇస్తున్నారు.
 
ఇప్పటివరకు పొందిన పథకాల ప్రయోజనాలను ఎలాంటి షరతులు లేకుండా పొందాలంటే జగన్ మళ్లీ సీఎం కావాలని వైసీపీని అభిమానించే అభిమానులు, పథకాల లబ్ధిదారులు చెబుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని జగన్ మాటల్లో ధీమా కనిపిస్తోంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో పథకాలను అమలు చేయలేదని జగన్ లెక్కలతో సహా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: