ఏపీ: పొన్నూరు రిజల్ట్ ఇలా ఉండబోతుందా..?

Pandrala Sravanthi
ఉమ్మడి గుంటూరు జిల్లాలో  ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో చాలా ఆసక్తికరంగా ఉన్న నియోజకవర్గం పొన్నూరు. ఈసారి ఈ కాన్స్టెన్సీ లో  టిడిపి, వైసిపి మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. మరి ఈ పోటీలో ఎవరు గెలుస్తారు.. ఎవరి బలబలాలు ఏంటి..  టిడిపి కంచుకోట మరోసారి వైసిపి బద్దలు కొడుతుందా అనే వివరాలు చూద్దాం.ఈసారి పొన్నూరు నుంచి అంబటి మురళి వైసిపి తరఫున బరిలో ఉన్నారు. ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత.  అంతేకాకుండా మంత్రి అంబటి రాంబాబు తమ్ముడు. వ్యాపారంలో సిద్ధహస్తుడు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ధూళిపాళ్ల నరేంద్ర  పోటీ చేస్తున్నారు. ఈయన కమ్మ సామాజిక వర్గం నేత. 
ఈయన తండ్రి కూడా ఇదివరకు క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 

ఈయన 1994లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత  నరేంద్ర వరుసగా అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో  వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్య  చేతిలో మొదటిసారి ఓటమిపాలయ్యారు. కానీ ఆయన పొన్నూరు నియోజకవర్గంలో అవినీతి, ఆరోపణలు తీవ్రంగా ఎదుర్కొన్నారు.  నియోజకవర్గాన్ని డెవలప్ చేయడంలో పూర్తిగా విఫలం అయ్యారని ఒక అపోహ కూడా ప్రజల్లో ఉంది. దీంతో ఆయనకి ఈసారి టికెట్ ఇస్తే గెలవరని వైసీపీ అధిష్టానం అభ్యర్థిని మార్చి  రాంబాబు తమ్ముడు మురళికి ఛాన్స్ ఇచ్చారు. పొన్నూరు నియోజకవర్గానికి మురళి కొత్త వ్యక్తి. అక్కడ జనాలతో అసలు పరిచయం లేదు. అంతేకాకుండా గత ఎన్నికల్లో ధూళిపాళ్ల నరేంద్ర కేవలం 1000 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయారు. అది కూడా 12వేల ఓట్లు జనసేన పార్టీ చీల్చడం వల్ల  ఆయన ఓటమిపాలయ్యారు.

ఈసారి ధూళిపాళ్ల నరేంద్ర తప్పక విజయం సాధిస్తారట. ఎందుకంటే టిడిపి ఈసారి జనసేన, బీజేపీ తో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఆ ఓట్లు కూడా ధూళిపాళ్లకే ప్లస్ అవుతాయి. అంతేకాకుండా వైసిపి అభ్యర్థిపై వచ్చిన వ్యతిరేకత మరో రకంగా ప్లస్ అవ్వనుంది. అంతేకాకుండా ఆ మధ్యకాలంలో కావాలనే ధూళిపాళ్లను జగన్ అక్రమంగా జైల్లో పెట్టించాడని  ప్రజలు విశ్వసించారు. అలాగే సంఘం డైరీని  నిర్వీర్యం చేసి  అమూల్ కంపెనీ పరం చేయాలని  ప్రభుత్వం కూడా కొన్ని కుట్రలు పన్నిందని చాలామంది పాడి రైతులకు అర్థం అయిపోయింది. అలాగే వైసిపికి చెందినటువంటి కీలక నాయకుడైనటు వంటి రావి వెంకటరమణ టిడిపిలో చేరిపోయారు. ఇలా ఏ విధంగా చూసినా  టిడిపికే  కలిసొచ్చే అంశాలు ఉండడంతో ఈసారి తప్పకుండా నరేంద్ర పొన్నూరు లో  విజయం సాధిస్తాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: