ఏంటి.. మహేష్ సినిమా కోసం.. జక్కన్న పారితోషకం తీసుకోవట్లేదా?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారి పారితోషకం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇక వరుసగా సక్సెస్ లో వచ్చాయి అంటే చాలు ఆకాశాన్ని అంటే విధంగా పారితోషికం డిమాండ్ చేస్తూ ఉంటారు హీరోలు అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోలలో ఒకటిగా కొనసాగుతున్న మహేష్ బాబు కూడా ఇలా టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటాడు అనడంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అయితే పారితోషకం విషయాన్ని ఆయా హీరోలు బయటకు చెప్పకపోయినా సినీ పండితులు మాత్రం ఒక అంచనా వేస్తూ ఉంటారు అని చెప్పాలి

 అయితే ఇక ఇప్పుడు జక్కన్న సినిమా కోసం అటు మహేష్ బాబు పారితోషకం తీసుకోవట్లేదు ఇందుకు సంబంధించిన వారితో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అయితే ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండు కొనసాగుతుంది. ఒకవేళ దర్శకుడు పై నమ్మకం ఉంటే పారితోషకానికి బదులు ఏకంగా లాభాల్లో వాటో తీసుకుంటున్నారు ఎంతోమంది హీరోలు. ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలు కూడా పలు సినిమాల విషయంలో ఇలాంటి పద్ధతిని ఫాలో అయ్యారు అని చెప్పాలి. ఇక మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకేక్కబోతున్న మూవీ విషయంలో కూడా ఇదే జరగబోతుందట.

 ఏకంగా ఈ సినిమా కోసం ఒకవైపు మహేష్ మరోవైపు జక్కన్న ఇద్దరు పారితోషకం తీసుకోవట్లేదట. లాభాల్లో వాటాలు మాత్రమే తీసుకుంటారని టాలీవుడ్ లో ఒక న్యూస్ వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం మహేష్ బాబు ఒక్కో సినిమాకి 60 నుంచి 80 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడు. మొదటిసారి జక్కన్న సినిమా కోసం పారితోషకం కాకుండా లాభాల్లో వాటా తీసుకునేందుకు డీల్ మాట్లాడుకున్నారట. రాజమౌళి కూడా గత కొంతకాలం నుంచి ఇదే చేస్తూ వస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక రాజమౌళి సినిమా అంటే లాభాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఇలాంటి నయా ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు అన్నది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: