పుష్ప నుండి చీరలో బన్నీ ఫోటో లీక్.. ఫైర్ అయిన సుకుమార్..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప టు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పుష్ప టు సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే అసలు సుకుమార్ అల్లు అర్జున్ నో ఈ సినిమాలో చీరలో అమ్మవారి గెటప్ లో చూపిస్తారు అని అసలు ఎవరు ఊహించలేదు కూడా. బన్నీ చీరలో కనిపిస్తాడు అని ఎవరు ఊహించలేక పోయినప్పటికీ ఇదివరకు సుకుమార్ అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ లో ఉన్న ఒకే ఒక్క ఫోటోని విడుదల చేశారు. ఇక ఆ ఫోటో ఇండియా వైడ్ గా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

గంగమ్మ జాతర బ్యాక్ డ్రాప్ లో వచ్చే కొన్ని సన్నివేశాల్లో పుష్పరాజ్ అమ్మవారి పాత్రలో కనిపిస్తాడు. అయితే ఇప్పటివరకు అఫీషియల్ గా ఒక్క ఫోటోని విడుదల చేసినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం పుష్ప సినిమా నుండి లీక్ అయిన ఫోటోలు అని వైరల్ చేస్తున్నారు. తాజాగా చీరలో ఉన్న అల్లు అర్జున్ లీక్డ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గత కొన్ని రోజులుగా రామోజీ ఫిల్మ్‌ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది పుష్ప2. అక్కడే గంగమ్మ జాతర సెటప్ వేసి చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే అమ్మవారి గెటప్‌కు సంబంధించిన షూటింగ్ అయిపోయింది. లేటెస్ట్ షెడ్యూల్‌లో హీరోయిన్‌ రష్మిక మందన్నతో పాటు ఫాహద్‌ ఫాసిల్‌ మరియు

 ఇతర నటీ నటులపై షూట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పుష్ప ఆన్ సెట్ ఫోటో ఒకటి లీక్ అయింది. అల్లు అర్జున్ చీర కట్టుకొని కుర్చీలో కూర్చున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఫోటో ఎలా లీక్ అయిందో తెలియదు గానీ సుకుమార్ మాత్రం ఈ విషయంలో సీరియస్‌ అయినట్టుగా తెలుస్తోంది. గతంలోను పుష్ప 2 సెట్స్ నుంచి చాలా లీకులు అయ్యాయి. దాంతో, ఇలాంటి లీకుల జరగకుండా పుష్ప మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా కూడా మళ్లీ ఇప్పుడు సెట్ నుంచి పవర్ ఫుల్ లీక్ బయటకి వచ్చింది. అల్లు అర్జున్ చీర కట్టుకోని చైర్ లో కూర్చోని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. దీంతో పుష్ప చిత్ర యూనిట్ అసంతృప్తిగా ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: