లిప్ లాక్ సీన్స్ లో నటించేందుకు.. నేను రెడీ అంటున్న మహేష్ బాబు హీరోయిన్?

praveen
ఒకప్పుడు తెలుగు సినిమాలలో రొమాన్స్ అనేది పెద్దగా కనిపించేది కాదు. కానీ ఇప్పుడు రొమాంటిక్ సన్నివేశాలు లేని సినిమాలు ఉన్నాయా అంటే వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నేటి ట్రెండ్ అలా మారిపోయింది. అయితే బాలీవుడ్ లో ఉండే లిప్ లాక్ సన్నివేశాలు టాలీవుడ్ కి కూడా పాకిపోయాయి. దీంతోస్టార్ హీరో హీరోయిన్లు అందరూ కూడా లిప్ లాక్ సన్నివేశాలలో నటించేందుకు ఎక్కడ వెనకడుగు వేయడం లేదు. అయితే కొంతమంది దర్శకులు కేవలం కథకు అవసరం అయితేనే ఇలాంటి సన్నివేశాలను సినిమాల్లో పెడుతున్నారు.

 కానీ మరికొంతమంది దర్శకులు మాత్రం సినిమా స్టోరీకి అవసరం లేకపోయినా ఇక ఇలాంటి సన్నివేశాలను పెట్టి ప్రేక్షకులను ఆకర్షించాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కొంతమంది అయితే సినిమా మొత్తం కూడా ఏకంగా శృంగార సన్నివేశాలతోనే సినిమాలు తీస్తూ ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే కొంతమంది హీరోలు ఇక లిప్ లాక్ సన్నివేశాల విషయంలో  కొన్ని నిబంధనలు పెట్టుకుంటున్నారు. ఇక తమ దగ్గరికి సినిమా ఆఫర్ తో వచ్చిన దర్శక నిర్మాతలకు ముందుగా ఈ కండిషన్స్ చెబుతున్నారు అని చెప్పాలి.

 అయితే తాను కూడా లిప్ లాక్ సీన్స్ లో నటించేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ చెబుతుంది హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఇటీవల మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం మూవీలో హీరోయిన్గా నటించింది మీనాక్షి. మహేష్ బాబు మరదలు పాత్రలో నటించి తన అందం అభినయంతో  ఆకట్టుకుంది అని చెప్పాలి. అయితే స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే తప్ప లిప్ లాక్ సన్నివేశాలకు ఒప్పుకోను అంటూ స్పష్టం చేసింది. అది కూడా అసభ్యకరంగా లేకుంటేనే ఓకే చెబుతాను అంటూ తెలిపింది. కేవలం లిప్ లాక్ సన్నివేశాల కోసమే సినిమా అనట్లుగా ఉంటే మాత్రం నిర్మొహమాటంగా నో చెప్పేస్తాను అంటూ తెలిపింది ఈ హీరోయిన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: