యాక్షన్ హీరో అర్జున్ చిన్న కూతురు.. వెరైటీ బిజినెస్?

praveen
దక్షిణాది చిత్ర పరిశ్రమ లో యాక్షన్ కింగ్ గా పేరు సంపాదించుకున్నాడు హీరో అర్జున్. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి కోట్ల మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు అని చెప్పాలి. అయితే ఇక అర్జున్ హీరోగా నటించిన ఎన్నో సినిమాలు ఇండస్ట్రీ హిట్లు కూడా కొట్టాయి. ఇక ఇప్పుడు హీరోగా నటించక పోయినా అటు ఇతర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తన నటనతో ఆకట్టుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. సహాయ నటుడిగా విలన్ గా కూడా పాత్ర లో పోషిస్తున్నాడు అని చెప్పాలి.

 అయితే యాక్షన్ కింగ్ అర్జున్ ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు ఇండస్ట్రీకి ఎంతో మంది హీరో హీరోయిన్గా పరిచయమయ్యారు. అర్జున్ మేనల్లుడు ధ్రువ ఇప్పటికే హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తూ వున్నాడు.  పెద్ద కూతురు ఐశ్వర్య కూడా సినీ రంగంలో అడుగుపెట్టి అవకాశాలను అందుకుంటుంది. అయితే ఇటీవల పెళ్లి చేసుకుంది. కాగా ఇక ఇప్పుడు హీరో అర్జున్ చిన్న కూతురు గురించి ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోయింది.  అర్జున్ ఫ్యామిలీకి చెందిన ఎంతోమంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే అర్జున్ చిన్న కూతురు అంజన మాత్రం తండ్రి లాగా ఇండస్ట్రీ లోకి రాలేదు.

 పారిశ్రామిక వేతగా గుర్తింపును సంపాదించుకుంటుంది. అయితే ఎవరు ఊహించని రీతిలో ఒక విచిత్రమైన వ్యాపారం చేస్తుంది. హైదరాబాద్లో హ్యాండ్ బ్యాగ్ల తయారీ యూనిట్ని ప్రారంభించింది అర్జున్ కూతురు అంజన. గతంలో తెలంగాణ గవర్నర్ తమిళసై  ఈ సంస్థను ప్రారంభించి ఇక ఈ వ్యాపారాన్ని ప్రారంభించినందుకు అంజనను అభినందించారు. అయితే హ్యాండ్ బ్యాగ్స్ తయారీ అంటే విచిత్రం ఏంటి అనుకుంటున్నారు కదా.. ఏకంగా ఏకంగా పండ్ల తొక్కతో  హ్యాండ్ బ్యాగ్ లు తయారు చేస్తారు. గతంలో ఎవరు కూడా ఇది ప్రయత్నించలేదు. అంజన మొదటిసారి ఇలాంటి వ్యాపారం ప్రారంభించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: