రికార్డ్ లు బద్దలు కొడుతున్న మహేష్ బాబు కుర్చీ మడతపెట్టి సాంగ్..!!

Anilkumar
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు యంగ్ బ్యూటీ శ్రీ లీల కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించింది ఈ సినిమా. కాగా ఈ సినిమా కంటే ఎక్కువ ఈ సినిమాలోని గూర్చి మడత పెట్టి పాటే బాగా పాపులర్ అయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ పాట మాత్రమే బ్లాక్ బస్టర్ గా నిలిచింది అని కూడా చెప్పొచ్చు. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతం

 అందించిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ లీల ఈ పాటకి వేసిన స్టెప్పులు ఈ పాటని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాయి అని చెప్పాలి. ఆమె డాన్స్ తో పాటు మహేష్ బాబు ఎనర్జీ కూడా ఈ పాటని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటలోని స్టెప్పులు మామూలుగా లేవు. కుర్చీమడతపెట్టి సాంగ్ రికార్డ్ మీద రికార్డ్ లు సాధిస్తోంది. ఎక్కడ చూసినా.. ఈపాట..

ఈమ్యూజిక్ మారుమోగుతోంది. ప్యూస్ పరంగా మిలియన్ల కొద్ది సాధిస్తోన్న ఈ సాంగ్.. తాజాగా రీల్స్ పరంగా కూడా రికార్డు నెలకొల్పింది. ఏదైనా సినిమా నుంచి హిట్ సాంగ్ వస్తే.. దాన్ని రీల్స్ గా చేయడం అలవాటుగామారింది నెటిజన్లకు. పాపులర్ సాంగ్స్ ను రీల్స్ ద్వారా ఇంకా పాపులర్ చేసేస్తున్నారు. తాజాగా కుర్చి మడతపెట్టి సాంగ్ కూడా ఇలాలే ఇంకా పాపలర్ అయ్యి రీల్స్ పరంగా కూడా రికార్డ్ సృష్టించింది. ఇన్ స్టాలో కుర్చీ మడతపెట్టి పాటకి సెన్సేషన్ రెస్పాన్స్ వస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ పాటకి వన్ మిలియన్ కి పైగా రీల్స్ వచ్చాయి. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: