పూజ హెగ్దేని వదలని అక్కినేని హీరో..!

shami
తెలుగులో దాదాపు కెరీర్ పూర్తైనట్టుగా కనిపిస్తున్న పూజా హెగ్దేకి ఓ లక్కీ ఛాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఒక నట వారసుడి తన సినిమాలో పూజానే హీరోయిన్ గా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడట. ఆల్రెడీ ఆ హీరోతో ఒక సినిమా చేయగా అది సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ ఆమెతో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఇంతకీ ఎవరా హీరో అంటే అక్కినేని హీరో అఖిల్ అని తెలుస్తుంది.

అక్కినేని యువ హీరో అఖిల్ కెరీర్ లో కొట్టిన ఒకే ఒక్క హిట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్దే కలిసి నటించారు. అఖిల్ కి మొదటి హిట్ ఇచ్చిన హీరోయిన్ గా పూజా హెగ్దే క్రేజ్ తెచ్చుకుంది. అయితే తెలుగులో సినిమాలు ఏవి లేకపోవడం వల్ల మళ్లీ అఖిల్ సినిమాలో ఆమెను తీసుకోవాలని అనుకుంటున్నారట.

పూజా హెగ్దే ని తన సినిమా లో హీరోయిన్ గా తీసుకోవాలని నిర్మాతలకు చెబుతున్నాడట. పూజా కూడా తెలుగు లో మరో ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది. స్టార్ హీరోలంతా ఆమెని కాదంటున్నా సరే అఖిల్ మాత్రం పూజాకి ఇక్కడ ఉన్న క్రేజ్ చూసి ఆమె తో జత కట్టాలని చూస్తున్నాడు. పూజా హెగ్దే తెలుగులో ఎలాంటి ఛాన్స్ వచ్చినా చేసేందుకు రెడీ అంటుంది. టాలీవుడ్ లో గుంటూరు కారం నుంచి ఎగ్జిట్ అయ్యాక ఒక్క అవకాశం కూడా రాబట్టుకోని పూజా తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. పూజా హెగ్దే తెలుగు ఫ్యాన్స్ కూడా ఆమె మళ్లీ ఇక్కడ సినిమాలు చేస్తే చూడాలని అనుకుంటున్నారు. కానీ పూజాకి ఇప్పుడప్పుడే ఛాన్స్ లేనట్టుగా ఉంది. మరి ఆ అవకాశం అఖిల్ ఇస్తాడా లేదా మరో హీరో ఇస్తాడా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: