ఏంటి.. ప్రభాస్ కు ఆ హీరోయిన్ అంటే ఇష్టం ఉండదా.. అందుకే కలిసి నటించలేదా?

praveen
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఇక భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా కొనసాగుతూ ఉన్నాడు ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు పెద్దగా ఆడకపోయినప్పటికీ అటు ప్రేక్షకులను మాత్రం మెప్పించి భారీగా ప్రభాస్ కి అభిమానులను మాత్రం సాధించిపెట్టాయి. ఇక ఇటీవలే సలార్ అనే సినిమాతో ప్రభాస్ ఒక బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే.

 ఇక ఇప్పుడు కల్కి,  రాజా సాబ్ లాంటి సినిమాలలో నటిస్తూ ఉన్నాడు.. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు ప్రభాస్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఇప్పటివరకు ప్రభాస్ తన కెరియర్ లో ఎంతో మంది హీరోయిన్స్ తో కలిసి నటించాడు. అయితే ప్రభాస్ కి ఒక హీరోయిన్ అంటే మాత్రం అస్సలు పడదట. అందుకే ఇప్పుడు వరకు ఆ హీరోయిన్ తో ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఇంతకీ ఇలా ప్రభాస్ కు నచ్చని హీరోయిన్ ఎవరో తెలుసా ప్రేక్షకులందరికీ నచ్చిన సమంత.

 అయితే దీని వెనుక కారణం కూడా ఉంది. ప్రభాస్ కు అత్యంత సన్నిహితంగా ఉండే డైరెక్టర్లలో వివి వినాయక్ కూడా ఒకరు  అయితే వివి వినాయక్ ప్రభాస్ తో ఒక సినిమా ప్లాన్ చేశారట. ఆ సినిమా ఏదో కాదు అల్లుడు శీను. బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా  సినిమా వచ్చింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత చేసింది  అయితే ముందుగా ప్రభాస్తో సినిమా తీయాలని అనుకున్నారట వివి వినాయక్. సినిమా స్టోరీ మొత్తం ప్రభాస్ కి కూడా చెప్పాడట. అయితే సినిమాలో హీరోయిన్గా సమంతను తీసుకుందామని  వినాయక్ చెప్పగా వామ్మో సమంత అయితే నేను చచ్చిన ఈ సినిమాలో నటించను. సమంతతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నావల్ల కాదు. నేను ఈ సినిమాలో ఎట్టి పరిస్థితుల్లో నటించను అని ప్రభాస్ చెప్పేశాడట. అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారడంతో ప్రభాస్ కు నిజంగానే సమంత అంటే ఇష్టం లేదా అని వార్తలు తెరమీదకి వచ్చాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: