టెంప్ట్ చేస్తున్న బాలయ్య బ్యూటీ....!!

murali krishna
హనీ రోజ్ కుర్రాళ్ళ కలల రాణిగా సోషల్ మీడియాను ఏలుతుంది. లక్షల మంది ఈమె గ్లామర్ ట్రీట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.కేరళకు చెందిన హనీ రోజ్ పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతుంది. 2005లో విడుదలైన బాయ్ ఫ్రెండ్ అనే మలయాళ చిత్రంలో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. హనీ రోజ్ కి రెండేళ్లు గ్యాప్ వచ్చింది. 2007లో ఒక తమిళ చిత్రం చేసింది.మూడో చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆలయం అనే టైటిల్ తో తెరకెక్కిన చిత్రంలో హనీ రోజ్ హీరోయిన్. ఈ చిత్రంలో శివాజీ హీరోగా నటించాడు. అంతగా ఆడలేదు. దాంతో భారీ గ్యాప్ వచ్చింది. ఆరేళ్ళ తర్వాత వరుణ్ సందేశ్ కి జంటగా ఈ వర్షం సాక్షిగా టైటిల్ తో మూవీ చేసింది. ఇది కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. హనీ రోజ్ మలయాళంలో ఎక్కువగా సినిమాలు చేసింది. తమిళ్, కన్నడలో కూడా చిత్రాలు చేసింది.గత ఏడాది విడుదలైన వీర సింహారెడ్డి మూవీతో హనీ రోజ్ పాపులారిటీ తెచ్చుకుంది. ఈమె గతంలో తెలుగులో నటించిన విషయం కూడా జనాలు మర్చిపోయారు. బాలకృష్ణకు భార్యగా, తల్లిగా రెండు భిన్నమైన పాత్రల్లో ఆమె నటించారు. హనీ రోజ్ గ్లామర్ తో పాటు ఎమోషనల్ సీన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. వీరసింహారెడ్డి హిట్ కావడంతో హనీ రోజ్ కి వరుస అవకాశాలు వస్తాయని అందరూ భావించారు.అయితే తెలుగులో ఆశించినంతగా అవకాశాలు రాలేదు. ఆ మధ్య హైదరాబాద్ లో రెస్టారెంట్ ఓపెనింగ్ కి హనీ రోజ్ వచ్చింది. జనాలు ఎగబడ్డారు. హనీ రోజ్ కి ఆఫ్ స్క్రీన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. ఆమె కాలు బయట పెడితే కుర్రాళ్ళు చుట్టుముడతారు. ఇంస్టాగ్రామ్ లో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. గ్లామరస్ వీడియోలు, ఫొటోలతో వాళ్ళను మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా ఆరంజ్ కలర్ బాడీ కాన్ డ్రెస్ లో సరికొత్తగా దర్శనం ఇచ్చింది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: