"మీరాయ్" నుండి మనోజ్ గ్లిమ్స్ వీడియో వచ్చేసింది... ఈసారి గట్టిగానే కొట్టేలా ఉన్నాడే..?

Pulgam Srinivas
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడుగా తెలుగు తెరకు పరిచయం అయిన మంచు మనోజ్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో హీరోగా నటించి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. ఇకపోతే మనోజ్ కొంత కాలం క్రితం ఓ పెళ్లి చేసుకున్నాడు. కానీ కొన్ని మనస్పర్ధల వల్ల ఆమెతో విడిపోయాడు. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక మొదటి పెళ్లి తర్వాత కొంత కాలం పాటు మనోజ్ సినిమాలకు దూరంగా ఉన్నాడు.
 

ఇక మళ్ళీ వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా కేవలం సినిమాల్లో హీరో పాత్రలలో మాత్రమే నటించడం కాకుండా విలన్ పాత్రలో కూడా నటించడానికి మనోజ్ ఆసక్తిని చూపిస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం తేజ సజ్జ హీరో గా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న మిరాయ్ అనే సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాలోని మనోజ్ క్యారెక్టర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడం మాత్రమే కాకుండా మనోజ్ క్యారెక్టర్ కు సంబంధించిన చిన్న గ్లిమ్స్ వీడియోను కూడా విడుదల చేసింది.

ఈ వీడియోలో మనోజ్ చాలా క్రూరంగా కనిపించాడు. అలాగే స్టైలిష్ గా కూడా ఉన్నాడు. ఇక ఇప్పటి వరకు ఈ గ్లిమ్స్ వీడియో ద్వారా మనోజ్ కు సూపర్ క్రేజ్ లభించే అవకాశాలు ఉన్నట్లు చాలా మంది అంచనా వేస్తున్నారు. ఇక మనోజ్ ఇంట్రడక్షన్ గ్లిమ్స్ వీడియోతో పాటు ఈ మూవీ ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 18 వ తేదీన 2D మరియు 3D లలో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ , బెంగాల్ , చైనీస్ భాషలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mm

సంబంధిత వార్తలు: