తెలుగు సినిమా నుంచి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. హాట్ టాపిక్ గా మారిన పాయల్ రాజ్ పుత్ ఇన్ స్టా పోస్ట్?

Anilkumar
'RX100' బ్యూటీ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ తన సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ నుంచి తనను బ్యాన్ చేస్తామని ఓ మూవీ నిర్మాతలు బెదిరిస్తున్నట్లు తన పోస్ట్ లో వెల్లడించింది. తాను నటించిన కొత్త సినిమా మేకర్స్ తో రెమ్యునరేషన్ విషయంలో గొడవ జరిగినట్లు చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ తన ఇన్ స్టా పోస్ట్ లో.."  నేను 2020 లో రక్షణ అనే సినిమాలో నటించాను. ఈ మూవీ రిలీజ్ ఇప్పటిదాకా డిలే అవుతూ వచ్చింది. మూవీ టీమ్ ఇప్పటివరకు నాకు రెమ్యునరేషన్

 ఇవ్వలేదు. ఇటీవల నా సినిమాలు సక్సెస్ అందుకోవడంతో దాన్ని మూవీ టీమ్ యూజ్ చేసుకోవాలని భావిస్తుంది. నాకు ఎలాంటి బకాయిలు చెల్లించకుండా ప్రమోషన్స్ కి రావాలని డిమాండ్ చేస్తున్నారు. నేను రాలేనని నా టీమ్ వాళ్ళు చెప్పినా వినడం లేదు. దాంతో నన్ను తెలుగు సినిమా నుంచి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు. రెమ్యునరేషన్ ఇస్తే ప్రమోషన్స్ చేస్తానని చెప్పినా వినడం లేదు. నా ప్రతిష్టకి భంగం కలిగేలా నా పేరును వాడుకుంటున్నారు. ఇది పద్దతి కాదు. రీసెంట్ గా జరిగిన కొన్ని మీటింగ్స్ లో నాపై అసభ్యకరంగా

 మాట్లాడారు. రెమ్యునరేషన్ మ్యాటర్ తేల్చకుండా నా పర్మిషన్ లేకుండా సినిమాని రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు. అందుకే నా టీమ్ 
మూవీ టీమ్ చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయిది" అని పేర్కొంది. ఆర్ ఎక్స్100 సినిమాతో ఒక్కసారిగా కుర్రాళ్ల కలల రాకుమారి అయ్యింది ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్.   ఆతర్వాత ఈ చిన్నదనికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి.  అదే సమయంలో అజయ్ భూపతి దర్శకత్వంలో మంగళవారం అనే సినిమా చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మంగళవారం సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. అలాగే అందాలతోనూ రెచ్చిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: