బింబిసారా-2 నుండి వశిష్ట తప్పుకోవడానికి.. చిరంజీవి కారణమా?

praveen
టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో ఒకే ఒక సినిమా తో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు వశిష్ట మల్లిడి  సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన వశిష్ట నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో సినిమా చేశాడు అన్న విషయం తెలిసిందే. అప్పటికే వరుస పరాజయాల తో సతమతమవుతున్నాడు కళ్యాణ్ రామ్. అలాంటి ఫ్లాప్ హీరో తో సినిమా చేసి ఒక సాహసమే చేశాడు వశిష్ట.

 అయితే ఇక వశిష్ట దర్శకత్వం లో వచ్చిన బిందుసారా సూపర్ హిట్ అయింది. కళ్యాణ్ రామ్ కెరీర్ కి కూడా బాగా ఉపయోగపడింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతం లోనే ప్రకటించాడు దర్శకుడు వశిష్ట. కానీ అనూహ్యం గా ఈ సినిమా సీక్వెల్ నుంచి అతను తప్పుకున్నాడు. దీంతో అతను బింబిసార సీక్వల్ నుండి తప్పుకోవడం పై ఎన్నో కథనాలు వచ్చాయి. కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ డైరెక్టర్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. పార్ట్ 2 కథ విషయంలో నా ఆలోచన వేరుగా ఉంది. దాని గురించి చర్చిస్తున్న సమయంలోనే నాకు విశ్వంబరా ఆఫర్ వచ్చింది. ఈ విషయాన్ని కళ్యాణ్ రామ్ తో చెప్పి మరి ఆయన అనుమతి తీసుకున్న తర్వాత బింబిసార 2 నుంచి బయటకు వచ్చాను అంటూ వశిష్ట క్లారిటీ ఇచ్చాడు.

 కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో విశ్వంబర అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు వశిష్ట  ఈ మూవీ పై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. సోసీయో ఫాంటసీ మూవీగా సినిమా తెరకెక్కుతోంది అని చెప్పాలి. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులు అందరిని కూడా ఎంతగానో ఆకట్టుకుంది. మెగాస్టార్ విశ్వంభరా మూవీకి సంబంధించి మరిన్ని అప్డేట్ల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: