దేవర డిజిటల్ రైట్స్ తో రికార్డ్..!

shami
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ని కాస్త మాన్ ఆఫ్ మాసెస్ చేస్తిన సినిమా దేవర. స్క్రీన్ నేం మార్చి సత్తా చాటేందుకు వస్తున్నాడు తారక్. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమాతో మరోసారి బాక్సాఫీస్ పై తన పంజా విసరాలని చూస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సెన్సేషనల్ హిట్ కాగా మరోసారి ఈ కాంబో ఆ హిట్ మేనియా రిపీట్ చేయాలని చూస్తుంది. దేవర ఒక సినిమాగా కాదు రెండు భాగాలుగా వస్తుంది. సినిమా విషయంలో కొరటాల శివ ఫుల్ ఫోకస్ తో పనిచేస్తున్నారని తెలుస్తుంది.

దేవర సినిమా సెట్స్ మీద ఉండగానే బిజినెస్ డీల్స్ అదరగొడుతున్నాయి. సినిమా ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనేసిందని తెలుస్తుంది. దేవర ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ 155 కోట్ల భారీ ధరకు కొనేసిందట. అన్ని భాషలకు కలిసి ఈ రేటు ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ తో గ్లోబల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న తారక్ సినిమాపై నెట్ ఫ్లిక్స్ భారీ డీల్ సెట్ చేసుకుందని చెప్పొచ్చు.

దేవర సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు అనిరుద్ మ్యూజిక్ కూడా భారీ క్రేజ్ తీసుకు రానుంది. దేవర సినిమాలో ఎన్.టి.ఆర్ నట విశ్వరూపం చూపిస్తాని తెలుస్తుంది. దేవర మొదటి పార్ట్ ఏప్రిల్ 5న రిలీజ్ లాక్ చేశారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. సినిమాపై తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు నేషనల్ వైడ్ ఆడియన్స్ భారీ అంచనాలతో ఉన్నారు. నెట్ ఫ్లిక్స్ కేవలం దేవర మాత్రమే కాదు పుష్ప 2, ఎన్.బి.కె 109 ఇంకా చాలా సినిమాలను కూడా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఈ సినిమాలతో నెట్ ఫ్లిక్స్ ఇండియాలో టాప్ వ్యూషర్ షిప్ సాధించడం పక్కా అని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: