'హనుమాన్' సీక్వెల్.. ఆ పాత్రలో రామ్ చరణ్..!!

Anilkumar
యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జ హీరోగా నటించిన 'హనుమాన్' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. ఇండియన్ సూపర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీకి ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. ప్రశాంత్ వర్మ టేకింగ్కి, తేజ సజ్జ యాక్టింగ్కి ప్రతీ ఒక్కరూ మెస్మరైజ్ అయిపోతున్నారు. దీంతో థియేటర్స్ అంతా జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిపోతున్నాయి. 'మనిషికి సంకల్పబలం ఉంటే విశ్వంలో ఉన్న అన్ని శక్తులు ఏకమై అతన్ని విజయతీరాలకు చేరుస్తాయి' అనే మాటకి ప్రత్యక్ష నిదర్శనంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాని తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. 

ఇక సినిమా చివర్లో 'హనుమాన్'సీక్వెల్ పై ఒక్కసారిగా ఆసక్తి పెంచేశారు. ఎండ్ టైటిల్స్ లో వచ్చే ఓ షాట్ సీక్వెల్ ఫై అంచనాలను భారీగా పెంచేసింది. ఆ షాట్ లో హనుమాన్ శ్రీరాముడికి ఒక మాట ఇచ్చినట్టుగా చూపించారు. ఈ క్రమంలోనే హనుమాన్ సీక్వెల్లో ఇతిహాస పాత్రలైనా ఆంజనేయుడు శ్రీరాముడిగా ఎవరు కనిపిస్తారనే విషయాలు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేపాయి. దీంతో హనుమాన్ సీక్వెల్ లో శ్రీరాముడి పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపిస్తారంటూ ఓ క్రేజీ న్యూస్ నెట్టింట స్ప్రెడ్ అవ్వడం మొదలైంది. శ్రీరాముడి పాత్రలో రామ్ చరణ్ అంటే వింటుంటే ఎంతో ఎక్సైటింగ్ గా ఉంది.

కానీ ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. హనుమాన్ సీక్వెల్లో ఆంజనేయుడు, శ్రీరాముడి పాత్రల్లో ఎవరు నటిస్తారనేది ఇప్పట్లో తెలిసే అవకాశం లేదని అంటున్నారు. కానీ ఈ సీక్వెల్ లో కనుక రామ్ చరణ్ నటిస్తే దాని ఇంపాక్ట్ వేరే లెవెల్ లో ఉంటుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లో 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాలు, ఉత్తరాదిలో మాత్రమే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌ లోనూ 'హనుమాన్'కు భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే నార్త్ అమెరికాలో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన తెలుగు టాప్ 10 సినిమాల్లో ఒకటిగా 'హనుమాన్' చోటు సంపాదించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: