'హనుమాన్' లో నటించినందుకు.. రాకేష్ మాస్టర్ ఎంత తీసుకున్నారో తెలుసా?

praveen
దివంగత కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ గురించి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఒకప్పుడు ఇక టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్ గా ఉన్న సమయంలో పెద్దగా ఆయన గురించి ఎవరికీ తెలియదు. స్టార్ హీరోల సినిమాలకు డాన్సులు సమకూర్చాడు అన్న తెలియదు. కానీ ఢీ షోలో జడ్జిగా ప్రత్యక్షమై కాస్త తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడుగా మారిపోయాడు. అయితే ఇక కొన్నేళ్ల క్రిందట సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయాడు రాకేష్ మాస్టర్.

 ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్ కు గురువు అని తెలిసి ఎంతో మంది ఈయన గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు అని చెప్పాలి. అయితే ఒకప్పుడు ఇలా టాప్ కొరియోగ్రాఫర్ గా హవా నడిపించిన రాకేష్ మాస్టర్ జీవితంలో అనుకోని సంఘటనల వల్ల ఆయన కెరియర్ పూర్తిగా నాశనం అయింది. ఇక సోషల్ మీడియాలో ఇక సంచలన వ్యాఖ్యలు చేయడంతో తరచూ వార్తల్లో ఉండేవాడు రాకేష్ మాస్టర్. ఇటీవలే రాకేష్ మాస్టర్ చనిపోయిన తర్వాత కూడా మరోసారి వార్తల్లో నిలిచాడు.

 తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకేక్కిన హనుమాన్ అనే సినిమాలో కీలక పాత్ర పోషించాడు రాకేష్ మాస్టర్. ఊరికి పెద్దగా ఉండే గజేంద్ర అనుచరులుగా పులిరాజు అనే పాత్రలో కనిపించాడు. జనాల దగ్గర పన్నులు వసూలు చేస్తూ ఉండే పాత్రలో నటనతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. దీంతో రాకేష్ మాస్టర్ పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది.  ఆయన ఇప్పుడు బ్రతికి ఉండి ఉంటే ఆయన కెరియర్ సూపర్ గా ఉండేది అని ఎంతోమంది గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఈ మూవీలో నటించినందుకు గాను రాకేష్ మాస్టర్ దాదాపు రెండు లక్షలు పారితోషకం తీసుకున్నాడట. చిన్న పాత్ర కావడంతో ఇక రాకేష్ మాస్టర్ ఎక్కువ డిమాండ్ చేయలేదు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: