నానితో పూజా హెగ్దే చేయనన్నదా..?

shami
మొన్నటిదాకా టాలీవుడ్ లో ప్రతి సినిమా తనదే అన్నట్టుగా ఛాన్స్ లు అందుకున్న బుట్ట బొమ్మ పూజా హెగ్దే ఇప్పుడు టాలీవుడ్ లో అవకాశాలే లేక ఖాళీగా ఉంటుంది. గుంటూరు కారం సినిమాలో ఆమె ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అయ్యింది. ఆ సినిమాలో అమ్మడు ఉంటే ఎలా ఉండేదో కానీ ప్రస్తుతానికి ఆ ఛాన్స్ వదులుకున్నందుకు పూజా కూడా సంతోషంగా ఉంది. ఇదిలాఉంటే స్టార్ హీరోల ఛాన్స్ లు రావట్లేదని టైర్ 2 హీరోల సినిమాలను కూడా చేయాలని అనుకుంటుందత పూజా హెగ్దే. అయితే ఈ క్రమంలోనే న్యాచురల్ స్టార్ నానితో నటించే ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.
నాని సినిమాలో హీరోయిన్ అంటే కచ్చితంగా పాత్ర ప్రాధాన్యత ఉంటుంది. తప్పకుండా ఆ పాత్రకు వెయిట్ ఉంటేనే నాని సినిమా అవుతుంది. హీరోయిన్ పాత్రలకు మంచి వెయిట్ ఉండేలా నాని చూసుకుంటాడు. ఐతే నాని సినిమాలో పూజా హెగ్దే అంటూ ఒక ప్రచారం జరిగినా నాని లాంటి న్యాచురల్ స్టార్ పక్కన పూజా హెగ్దే నటించగలదా అనుకున్నారు. పూజా బేబీ కేవలం గ్లామర్ షోతో నెట్టుకొస్తుంది. ఆమెకు అభినయం విషయంలో తక్కువ మార్కులే పడతాయని అంటుంటారు.
అయితే పూజా నాని కాంబో సెట్ అయ్యేది కానీ ఆమె డేట్స్ ఇష్యూ వల్ల ఆ ఛాన్స్ మిస్ అయ్యిందట. పూజాకు అనుకున్న ఆ సినిమాలోనే ప్రియాంక మోహన్ ని ఓకే చేశారు. నానితో పూజా దాదాపు చివరి దాకా వచ్చి కాంబినేషన్ కుదరలేదు. అయితే ఈ సినిమా కాకపోయినా మళ్లీ కుదిరితే నానితో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అంటుంది పూజా హెగ్దే. నానితో నటించడానికి హీరోయిన్స్ అంతా ఆసక్తి చూపుతారు. వారిలో ఇప్పుడు పూజా హెగ్దే కూడా చేరిపోయిందని చెప్పొచ్చు. తెలుగులో ఒక్క ఛాన్స్ అంటూ ఎదురుచూస్తున్న పూజాకి ప్రస్తుతానికి స్టార్స్ ఎవరు అవకాశం ఇవ్వట్లేదు కానీ టైర్ 2 హీరోల్లోనే ఎవరైనా అవకాశం ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: