బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ ప్రకటించిన దిల్ రాజు..!!

Divya
హీరో శర్వానంద్ నటించిన శతమానంభవతి సినిమా ఏడేళ్ల క్రితం సంక్రాంతి స్పెషల్గా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.. ఈ చిత్రం ఏకంగా జాతీయ అవార్డు ను సైతం అందుకుంది.. కుటుంబ నేపథ్య కథ చిత్రంతో వచ్చిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంది.. డైరెక్టర్ సతీష్ విగ్నేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శర్వానంద్ అనుపమ జంటగా నటించారు.. ప్రకాష్ రాజ్ జయసుధ వంటి వారు కూడా కీలకమైన పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా సీక్వెల్ని సైతం నిర్మాత దిల్ రాజు సంక్రాంతి స్పెషల్గా ప్రకటించారు..



శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ పతాకం బ్యానర్ పైన ఈ సినిమాని తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది ఏడేళ్ల క్రితం శతమానంభవతి సినిమాతో మాయాజాలం చేసిన ఈ సినిమా ఎప్పుడు 2025లో మరొకసారి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేందుకు సైతం సిద్ధంగా ఉండండి అంటూ తన ట్విట్టర్ నుంచి పోస్ట్ చేశారు దిల్ రాజు.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను తీసుకురాబోతున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా శతమానం భవతి నెక్స్ట్ పేజ్ అంటూ కూడా దీనిని ప్రకటించడం జరిగింది.


సంక్రాంతికి వచ్చే ఫ్యామిలీ మూవీస్ సైతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి.ఈ నేపథ్యంలోనే శతమానం భవతి వంటి సినిమా అని కూడా తీసుకురావాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ఎలాంటి ఫ్యామిలీ ఎమోషన్ కథ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి మరి.. ఇందుకు సంబంధించిన నటీనటులు ఎవరని విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అందుకు సంబంధించి ట్విట్టర్ కూడా వైరల్ గా మారుతోంది.. దాదాపు ఇంకా ఏడాది సమయం ఉండంగానే ఈ సినిమాని సైతం దిల్ రాజు ప్రకటించడం తో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు.. మరి ఏ మేరకు దిల్ రాజు ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: