ప్రభాస్ - మారుతి సినిమా పేరు.. రాజా డీలక్స్ కాదా.. కొత్త టైటిల్ ఏంటంటే?

praveen
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల సలార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు ప్రభాస్. దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత డార్లింగ్ ప్రభాస్ కి ఒక సాలిడ్ హిట్టు దక్కింది అని చెప్పాలి. దీంతో ఫాన్స్ అందరు కూడా ప్రస్తుతం పండగ చేసుకుంటున్నారు. ఇక ఆ తర్వాత కూడా ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

కాగా ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమాలలో ఒకటి మారుతి దర్శకత్వంలో మూవీ. ఈ మూవీపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు అన్న విషయం తెలిసిందే. ఎన్నో రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ టైటిల్ తోనే అటు ప్రభాస్ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి సమయంలో ఏకంగా రాజా డీలక్స్ టైటిల్  ని పూర్తిగా మార్చేశారు అన్నది తెలుస్తుంది. రాజా డీలక్స్ ని రాజా సాబ్ గా మార్చారట మేకర్స్.

 హర్రర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతూ ఉండడం గమనార్హం. ఈనెల 14వ తేదీన ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా రివీల్ కానుంది అన్నది తెలుస్తుంది. ప్రభాస్ రేంజ్ కు తగ్గట్టుగా ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ కూడా భారీగానే ఉందట. ఇక మారుతీ తన కెరీర్ లో మొదటిసారి ప్రభాస్ తో సినిమాని తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే మారుతీ తెరకెక్కించిన గత కొన్ని సినిమాలు చూసుకుంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదు. కానీ ప్రభాస్ మాత్రం మారుతిని నమ్మి చాన్స్ ఇవ్వగా.. ఈ డైరెక్టర్ ప్రభాస్ లాంటి బడా హీరో నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: