ప్రత్యేక క్యాలెండర్ ను లాంచ్ చేసిన ఎనర్జిటిక్ స్టార్ రామ్....!!

murali krishna
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..2006లో వచ్చిన దేవదాసు సినిమాతో వెండి తెర పై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.అప్పటి స్టార్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రామ్‌కు ఎంట్రీతోనే సూపర్ హిట్ ను అందించింది.ఆ తర్వాత రామ్ జగడం, రెడీ, కందిరీగ, మస్కా, ఒంగోలు గిత్త, నేను శైలజ మరియు ఉన్నది ఒకటే జందగీ వంటి సినిమాలతో ఎనర్జిటిక్‌ హీరోగా మంచి ఫేం సంపాదించుకున్నాడు. పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఇస్మార్ట్‌ శంకర్‌తో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాడు. ప్రస్తుతం మరో సారి పూరి దర్శకత్వంలో డబుల్‌ ఇస్మార్ట్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.రామ్ గతేడాది స్కంద సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. కానీ రామ్ పెర్ఫార్మన్స్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.ఇదిలా ఉంటే తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో రామ్ 18 సంవత్సరాలు సక్సెస్‌ఫుల్‌ జర్నీని పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా అభిమానులు మరియు మూవీ లవర్స్‌ రామ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎనర్జిటిక్‌ స్టార్‌ సినిమా ప్రయాణాన్ని తెలియజేస్తూ.. అభిమానులు ప్రత్యేకంగా రూపొందించిన క్యాలెండర్‌ను రామ్‌తో లాంఛ్ చేయించారు. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రామ్‌ మరిన్ని సినిమాలతో వినోదాన్ని అందిస్తూ తన జర్నీ కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు..  ప్రస్తుతం రామ్ నటిస్తున్న డబుల్‌ ఇస్మార్ట్‌ చిత్రంను పూరీ కనెక్ట్స్ బ్యానర్‌ తెరకెక్కిస్తోంది. హై ఆక్టేన్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ నుంచి తాజాగా రామ్‌ స్టైలిష్‌ గాగుల్స్‌ పెట్టుకొని గన్స్‌ మధ్య స్టైలిష్‌గా ఉన్న  లుక్‌ను విడుదల చేయగా ఇప్పటికే నెట్టింట తెగ వైరల్ అవుతుంది.డబుల్ ఇస్మార్ట్‌ మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో గ్రాండ్‌ గా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: