ఎట్టకేలకు ఓటీటిలో వస్తున్న ది..కేరళ స్టోరీ..!!
ఈ సినిమా ఏకంగా లాంగ్ రన్ టైంలో 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.ఈ చిత్రం బడ్జెట్ విషయం కేవలం 35 కోట్లే.. థియేటర్లో విడుదలకు ముందే డీ కేరళ స్టోరీ నిరంతరం వార్తలలో నిలిచింది. కేరళలో వివాదాస్పదమైన లవ్ జిహాద్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డైరెక్టర్ సుదీప్ తో సేమ్ తెరకెక్కించిన ఈ సినిమా ఒక్కసారిగా అటు రాజకీయ ప్రకంపనలను కూడా సృష్టించింది.. పశ్చిమ బెంగాల్ తమిళనాడు అంటి ప్రాంతాలలో ఈ చిత్రాన్ని నిషేధించడం కూడా జరిగింది.
అలాంటి సమయంలోనే ఎన్నో రాష్ట్రాలు సైతం పన్ను మినహాయింపును కూడా ప్రకటించాయి బిజెపి నాయకులు ఈ చిత్రానికి మద్దతుగా నిలుస్తూ ఉండగా ప్రతిపక్షాలు మాత్రం తీవ్రమైన విమర్శలను కురిపిస్తున్నాయి.. ఇలా వివాదాలతో నిరంతరం వార్తలను నిలిచిన ది కేరళ స్టోరీ చిత్రం కలెక్షన్స్ పరంగా భారీగానే రాబట్టింది ఇప్పటివరకు ఈ సినిమా ఓటీటి లో విడుదలే కాలేదు.. దీంతో చిత్ర బృందం యూట్యూబ్లోనైనా విడుదల చేయాలని అనుకుంటున్నా సమయంలో జి -5 ఓ టి టి ప్లాట్ ఫామ్ ఈ చిత్రాన్ని సంక్రాంతికి స్విమ్మింగ్ చేయబోతున్నట్లు తెలియజేసింది జనవరి 12న ఈ సినిమా అన్ని భాషలలో అందుబాటులోకి ఉంటుందట.