ఆ హీరోను హగ్ చేసుకుంటే.. రజిని నాపై సీరియస్ అయ్యారు : రంభ

praveen
హాట్ హీరోయిన్ రంభ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి కొన్నాళ్లపాటు కుర్రాళ్ల మదిలో సేద తీరిన  హీరోయిన్. ఇక తన అందం అభినయంతో అందరిని ఆకట్టుకుంది. సాదరణంగా స్వర్గంలో రంభ ఊర్వశి మేనక ఉంటారని చెబుతూ ఉంటాం. అయితే ఈ ముగ్గురిలో రంభ గొప్ప అందగత్తె అని అంటూ ఉంటారు. కానీ స్వర్గంలో ఉన్న రంబ ఎలా ఉంటుందో తెలియదు. కానీ అటు అటు టాలీవుడ్ హీరోయిన్ రంభ ను మించి ఉండదు అని మాత్రం ఎంతోమంది ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు అని చెప్పాలి.
 ఒకప్పుడు తెలుగు తో పాటు తమిళ కన్నడ భాషలో నటించి ఆకట్టుకుంది. హిందీలో కూడా పలు సినిమాలు చేసింది రంభ. అయితే ఇక ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా మారిపోవడంతో అవకాశాలు లేవు. అయితే అందరిలాగానే మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది ఈ హీరోయిన్. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ లో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకుంది.

 నేను రజనీకాంత్ సార్ తో అరుణాచలం మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో హిందీలో సల్మాన్ ఖాన్ బంధన్ మూవీ కూడా చేయాల్సి వచ్చింది. అయితే రెండు సినిమాలు షూటింగ్స్ తో బిజీబిజీగా ఉండేదాన్ని. పగలు అరుణాచలంలో నైట్ బంధన్ షూటింగ్లో పాల్గొనేదాన్ని. అయితే ఈ రెండు సినిమాలు షూటింగ్ పక్కపక్కన  జరుగుతూ ఉండడంతో ఇబ్బందిగా అనిపించలేదు. ఓసారి హీరో సల్మాన్ అరుణాచలం మూవీ సెట్స్ కి వచ్చాడు. అలా ఆయనను చూడగానే వెంటనే వెళ్లి హగ్ చేసుకుని పలకరించాను. దాన్ని రజనీ సర్ చూసి వెంటనే  డైరెక్టర్ సుందర్  తో మాట్లాడి వెళ్లిపోయారు. ఆ తర్వాత రజిని వచ్చి టవల్ విసిరి కొట్టి నాతో ఆగ్రహంతో మాట్లాడితే మీరు అలా చేయకుండా ఉండాల్సింది  ఆయన మీతో కలిసి పనిచేయను అన్నాడు అని చెప్పడంతో నేను ఏడవటం మొదలుపెట్టా.  తర్వాత రజిని సార్ వచ్చి మాట్లాడితే నేనేం తప్పు చేశాను అని అడిగాను.. ఉదయం సల్మాన్ హగ్ చేసుకున్నది ప్రాక్టికల్ గా చూపించి.. బాలీవుడ్ లో హీరో అయితే హగ్ చేసుకుంటారు. మాకు అయితే షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతావు అంటూ ఆట పట్టించారు రజినీకాంత్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: