ఎన్టీఆర్ మేకప్ వేసుకున్నారని.. సినిమాటోగ్రాఫర్ మూవీ నుంచి తప్పుకున్నాడట తెలుసా?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని  ఎల్లలు దాటించిన మహానీయుడు ఎవరు అంటే నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు పేరు చెబుతూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఈయన అన్ని తరాలకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి. ఇక చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు గురించి మాటలు వర్ణించడం కూడా కష్టమే అని చెప్పాలి. అయితే సీనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో జరిగిన ఎన్నో విషయాలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక సినిమా సమయంలో ఎన్టీఆర్ మేకప్ వేసుకున్నారని సినిమా ఆటోగ్రాఫర్ చిత్రం నుంచి తప్పుకున్నారట.

 ఎన్టీఆర్ హీరోగా మద్రాస్ లోని సత్యం థియేటర్ యజమానులు నిర్మాతలుగా ఒక సాంఘిక చిత్రాన్ని మొదలుపెట్టారు. ఇక ఏ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా బాలీవుడ్ కెమెరామెన్ ఇషాన్ ఆర్యన్ తీసుకున్నారు. ఇక సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఇక సీన్ కి తగ్గట్టుగా కెమెరా ని కూడా సెట్ చేసుకున్నారట ఇషాన్ ఆర్య. అంతలోనే నిర్మాతకు ఇషాన్ ఆర్య షాక్ ఇచ్చాడు. ఏకంగా సినిమా చేయలేనని అక్కడి నుంచి వెళ్లిపోయారట. అయితే ఇప్పుడైతే టెక్నాలజీ వచ్చి కెమెరా మెన్స్ కి పెద్దగా ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. కానీ ఒకప్పుడు ఇలాంటివి ఏవి అందుబాటులోకి లేకపోవడంతో ఇక దర్శకుడు తో పాటు కెమెరా మెన్ కి కూడా డిమాండ్ కమాండ్ ఉండేది.

 అయితే ఇషాన్ ఆర్య ఇలా మూవీ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా ఉందట. ఎన్టీఆర్ తన మేకప్ తానే వేసుకుంటారు. ముఖానికి దట్టమైన మేకప్ లిప్ స్టిక్  విగ్గు కంప్లీట్ గెటప్ తో ఇంటి నుంచి బయలుదేరేవారట. అయితే ఇక సెట్ కి వచ్చిన ఎన్టీఆర్ మేకప్ చూసిన ఇషాన్ ఆర్యా  అదంతా తీసేయాలని కోరారు. దానికి నిర్మాతలు బదులిస్తూ ఆయన అవి లేకుండా నటించరు అని చెప్పారట. దాంతో ఇషాన్ ఆర్యా సమానమిస్తూ.. అయితే ఆయనకి అలవాటు అయిన కెమెరామెన్ ను పెట్టుకోండి. నేను ఇక ఈ సినిమాకు పని చేయలేను అంటూ చెప్పి ఇక చిత్రం నుంచి తప్పుకున్నారట. దీంతో అతని స్థానంలో నిర్మాతలు మరొకరిని పెట్టుకోవాల్సి వచ్చిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: