తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన యువ నటీమణులలో డింపుల్ హయాతి ఒకరు. ఈ ముద్దుగుమ్మ కొంతకాలం క్రితం విడుదల అయినటువంటి గద్దల కొండ గణేష్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించి ఈ మూవీలోని ఐటమ్ సాంగ్ లో తన అదిరిపోయే అందాల ప్రదర్శనతో , డాన్స్ తో కుర్రకారు ప్రేక్షకులను అలరించి సూపర్ క్రేజ్ ను ఈ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమలో ఈ బ్యూటీ దక్కించుకుంది. ఆ తర్వాత డింపుల్ , మాస్ మహారాజ రవితేజ హీరోగా రూపొందిన ఖిలాడి సినిమాలో హీరోయిన్ గా నటించింది.
ఇందులో ఈ బ్యూటీ తన నటనతో మాత్రమే కాకుండా అంతకుమించిన అందాల ప్రదర్శనతో కుర్రకారు ప్రేక్షకులను అలరించింది. కాకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈ బ్యూటీ కి ఈ మూవీ ద్వారా భారీ స్థాయిలో గుర్తింపు దక్కలేదు. కొంత కాలం క్రితం ఈ నటి గోపీచంద్ హీరోగా శ్రీ వాసు దర్శకత్వంలో రూపొందిన రామబాణం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా ఈ ముద్దు గుమ్మకు మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందించలేదు. ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్న ఈ నటికి విజయాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కడం లేదు.
ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో అందాలను ఆరబోస్తోంది. కాకపోతే అప్పుడప్పుడు మాత్రం ఈ.నటి క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా డింపుల్ అదిరిపోయే లుక్ లో ఉన్న వైట్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన వైట్ కలర్ బ్లౌజ్ ను ధరించి క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.