రాజేంద్రప్రసాద్ టైటిల్ ని వాడుకుంటున్న యంగ్ హీరో.. ఎవరంటే?

praveen
సాధారణంగా సినిమా ఎంత మంచి కథతో తెరకేక్కించినప్పటికీ ఆ సినిమాకు ఎలాంటి టైటిల్స్ పెట్టాము అన్నది కూడా ఎంతో ముఖ్యం. ఇక ఎందుకంటే ఈ సినిమా టైటిలే ఆ మూవీని ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకెళ్లగలదు. అందుకే టైటిల్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు దర్శక నిర్మాతలు. అయితే కొంతమంది కొత్త టైటిల్ని పెడితే ఇంకొంతమంది మాత్రం పాత సూపర్ హిట్ సినిమాలకు సంబంధించిన టైటిల్స్ తమ సినిమాలకు పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి పాత టైటిల్స్ తో వచ్చిన కొత్త సినిమాలు ఎన్నో సూపర్ హిట్ సాధించాయి అని చెప్పాలి.

 అయితే ఒకప్పటి స్టార్ హీరో తో సేమ్ ఇమేజ్ కలిగిన హీరో ఇప్పుడు ఆ టైటిల్ ని వాడుకుంటే ఇక సినిమాపై మరింత హైప్ పెరుగుతూ ఉంటుంది. అయితే ఒకప్పుడు రాజేంద్రప్రసాద్ నవ్వుల హీరోగా కొనసాగేవాడు. ఇక నేటి తరంలో ఇలా నవ్వుల హీరో ఎవరు అంటే అందరికీ గుర్తుకు వచ్చేది అల్లరి నరేష్. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ అప్పట్లో నమ్ముకున్న కామెడీ ట్రాక్ తోనే ఇక అల్లరి నరేష్ నేటితరంలో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. రాజేంద్రప్రసాద్ కెరియర్ లో భారీ విజయాన్ని సాధించిన సినిమా ఆ ఒక్కటి అడక్కు. ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించేసింది ఈ మూవీ.

 అయితే ఇక ఇప్పుడు ఇదే టైటిల్ ని నరేష్ వాడుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈ మూవీ ని అల్లరి నరేష్ తండ్రి దివంగత సత్యనారాయణ రూపొందించిన విషయం తెలిసిందే. శకుని పాత్రతో ఫేమస్ అయిన నటుడు సిఎస్ఆర్ వారసులు ఇటీవల కొత్త బ్యానర్ పెట్టి సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఆ సినిమాకే ఆ ఒక్కటి అడక్కు అనే టైటిల్ పెడుతున్నారని ఒక టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. కాగా ఈ మూవీలో అల్లరి నరేష్ హీరోగా నటించాడు అన్న విషయం తెలిసిందే. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం ప్రకటించే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: