ఆ విషయంలో స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్న బిగ్ బాస్ నిర్వాహకులు....!!

murali krishna
బిగ్ బాస్  తెలుగు సీజన్‌ 7 ఫైనల్ ఎంతో గ్రాండ్ గా ముగిసింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌  విజేతగా నిలిచాడు. డిసెంబర్ 17న జరిగిన గ్రాండ్ ఫినాలే తర్వాత పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ భారీగా వచ్చి చేరుకున్నారు.మరోవైపు రన్నరప్ అమర్ దీప్ చౌదరి ఫ్యాన్స్ కూడా అక్కడే గుమిగూడి వున్నారు.. ఈ క్రమంలో అమర్ దీప్‌ని ఒక గేట్ నుంచి, ప్రశాంత్‌ను మరో గేట్ నుంచి పంపించారు పోలీసులు.అమర్ దీప్ సైలెంట్‌గా వెళ్లిపోయాడు. కానీ అతని కుటుంబం పయనిస్తున్న కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేశారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. మరోవైపు శాంతి భద్రల నేపథ్యంలో ప్రశాంత్‌ను వెళ్లిపోమ్మంటే.. నేను దొంగతనం చేసానా నేనేందుకు వెళ్లాలి. రైతుబిడ్డకు గౌరవం ఇవ్వట్లేదు అని పోలీసులపై పల్లవి ప్రశాంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా వెళ్లిన ప్రశాంత్ మళ్లీ ఓపెన్ టాప్ జీప్‌లో వచ్చి ర్యాలీ చేసాడు.దాంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇలా శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా చేసిన పల్లవి ప్రశాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 14 రోజులు రిమాండ్‌ కూడా విధించారు. నాలుగు రోజులు చంచల్ గూడా జైలులో గడిపిన ప్రశాంత్ ఇటీవలే బెయిల్ మీద బయటకొచ్చాడు. ఈ కేసు విషయంపై బిగ్ బాస్ నిర్వాహకులకు  కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే బిగ్ బాస్‌ పై తీవ్ర వ్యతిరేకత వస్తుండగా తాజాగా పోలీసుల నోటీసులు షో నిర్వహకులకు తలనొప్పిగా మారింది.ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు షో నిర్వాహకులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఇకపై షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరూ కూడా  ర్యాలీలు వంటివి చేయకూడదని నిర్ణయించారట. ఈ విషయాన్ని అగ్రిమెంట్‌లో కూడా పొందుపరచనున్నారని సమాచారం. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ వార్త బాగా వైరల్ అవుతోంది. అయితే పల్లవి ప్రశాంత్ కారణంగా బిగ్ బాస్ ఆర్గనైజర్స్ షాకింగ్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: