ఏపీ: ఓటమి భయంతో ఏపీ అంతటా గొడవలు చేస్తున్న చంద్రబాబు అండ్ టీమ్..??
ఓడిపోతామని భయంతో టీడీపీ నేతలు ఇప్పటికే పలు పోలింగ్ కేంద్రాల వద్ద దౌర్జన్యాలకు తెగబడ్డారు. ఎన్నికల ఏజెంట్ల పై దాడులకు చేస్తున్నారు. అంతేకాదు కిడ్నాప్ తరహా నేరాలకు పాల్పడుతున్నారు. వీరు ప్రాంతాలవారీగా ఏపీలో ఎక్కడెక్కడ గొడవలు చేశారో తెలుసుకుందాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ నేతలపై జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు రాళ్లతో దాడి చేసే భయానక వాతావరణం సృష్టించారు. మూడు వాహనాలను కూడా డ్యామేజ్ చేశారు. పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, రెంటచింతల మండలంలోని పాల్వాయి గేటు వద్ద వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై దాడి చేశారు. టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లు పట్టుకుని ఈ దాడికి తెగించారు. ఈ కారణంగా పదిమంది వైసీపీ కార్యకర్తల తలలు పగిలాయి.
కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం పోరంకి హై స్కూల్ పోలింగ్ బూత్ వద్ద కూడా గొడవలు జరిగాయి. టిడిపి కార్యకర్తలు, టీడీపీ పార్టీ గుర్తు చూపిస్తూ తమకే ఓటు వేయాలని ఓటర్లను ప్రలోభానికి గురి చేస్తున్నారని వైసీపీ నేతలు వీరిపై అటాక్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కూడా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి. గొల్లప్రోలు టౌన్ లో ఒక మహిళను జనసేన కార్యకర్తలు ఏడిపించారు. అడ్డొచ్చిన వైసీపీ నేతలు పై దాడి చేయడంతో పరిస్థితి చాలా హింసాత్మకంగా మారింది. దర్శి నియోజకవర్గంలో కూడా గొడవలు జరిగాయి. ప్రకాశం జిల్లా, అనంతపురం జిల్లాలోని పలుచోట్ల కూడా టిడిపి నేతలు దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. కర్నూలు చిత్తూరు ఏలూరు నంద్యాల వంటి ప్రాంతాల్లో కూడా టీడీపీ కార్యకర్తలు కయ్యానికి కాలు దువ్వుతున్నారు.