దెందులూరు: పోలింగ్ రోజు చింత‌మ‌నేనికి వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి ఎలా చెమ‌ట‌లు ప‌ట్టించాడో చూశారా ?

Pulgam Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో ఉన్న దెందులూరు నియోజకవర్గం ఒకటి. అసెంబ్లీ ఎన్నికలలో ఇక్కడ పోటీ హోరాహోరీగా జరుగుతూ ఉంటుంది. 2009వ సంవత్సరం టీడీపీ పార్టీ నుండి చింతమనేని ప్రభాకర్ పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కొత్తూరు రామచంద్రారావు పై చింతమనేని భారీ మెజారిటీతో గెలుపొంది మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2009లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఈయన దెందులూరు నియోజకవర్గంలో మంచిపట్టును సంపాదించుకున్నాడు.

దానితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా టీడీపీ పార్టీ ఈ నియోజకవర్గానికి చింతమనేని అభ్యర్థిగా ఎంచుకుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీ జోష్ భారీగా ఉండడంతో ఈయన రెండవ సారి కూడా దెందులూరు నియోజకవర్గం నుండి గెలుపొందారు. ఇక రెండవసారి కూడా ఈయన గెలుపొందడంతో ఈయన దెందులూరు నియోజకవర్గంలో తనకు తిరిగే లేదు అనుకున్నాడు.

అలాంటి సమయంలోనే వైసీపీ అభ్యర్థి అయినటువంటి కొఠారు అబ్బయ్య చౌదరి ఈయనకు షాక్ ను ఇచ్చాడు. 2019వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా దెందులూరు నియోజకవర్గం నుండి చింతమనేని మూడవసారిగా ఈ పార్టీ నియమించింది. ఇక వైసీపీ పార్టీ అభ్యర్థిగా కొఠారు అబ్బయ్య చౌదరి ను నియమించారు. చాలా మంది చింతమనేని సీనియర్ కావడం, భారీ రాజకీయ అనుభవం ఉండడంతో అబ్బాయి చౌదరిని ఈజీగా ఓడిస్తాడు అనుకున్నారు. కానీ అబ్బాయి చౌదరి 17000 భారీ మెజారిటీతో చింతమనేని పై గెలుపొంది ఆయనకు పెద్ద షాక్  ఇచ్చాడు. ఇక 2024వ సంవత్సరంలో కూడా దెందులూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే సీటును చింతమనేనికే ఇచ్చింది.

వైసీపీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి కొఠారు అబ్బయ్య చౌదరి కి ఈ నియోజకవర్గం సీట్ ను ఇచ్చింది. అబ్బాయి చౌదరి ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ప్రజలకు సేవ చేయడంతో ఈయనకు ఈ ప్రాంతంలో మంచి పట్టు ఏర్పడింది. దానితో చింతమనేని ఎలాగైనా గెలవాలి అని ఈసారి భారీగా ప్రచారాలను చేశాడు. అలాగే ఎలక్షన్ల రోజు కూడా సతమతం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇలా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, నాలుగవసారి ఇదే ప్రాంతం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న చింతమనేనికి అబ్బాయి చౌదరి ఈ ఎన్నికల్లో చెమటలు పట్టిస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: