ఎలక్షన్ 2024: అధికారుల నిర్లక్ష్యం.. ఓటర్లు మృతి..!

Divya
ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలక్షన్ ఉద్రిక్తత గంట గంటకు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఓటింగ్ పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ చాలామందికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.. ముఖ్యంగా అటు ఎలక్షన్స్ ఆఫీసర్స్ కూడా పలు రకాల సమస్యలతో మరణించడమే కాకుండా.. ప్రజలు కూడా మరణిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో గుండెపోటుతో ఎలక్షన్ ఆఫీసర్ గడిచిన కొన్ని గంటల క్రితం మృతి చెందారు..

మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నరసింహ ఎంపీ తన ఎన్నికల నేపథ్యంలో పాల్గొనగా ఉక్కపోతగా ఉందని ఫ్యాన్ వద్ద కూర్చొని అలానే ఉన్నారు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో హుటాహుటిగా అక్కడి సిబ్బంది ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించారని వైద్యులు తెలియజేశారు.. అలాగే వీరితో పాటు ఉప్పల్లో మరొక విషాదం చోటుచేసుకుంది. ఓటు వేయడానికి వెళ్లిన మహిళ అభ్యర్థులలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అలాగే మరొక యువకుడు ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్ కు వెళ్లి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వీరందరితో పాటు మరొక మహిళ విజయలక్ష్మి ఆమె కూడా గుండెపోటుతోనే మరణించింది.

అయితే వీరందరిని ఆసుపత్రికి హుటాహుటిగా తరలిస్తున్న సమయంలోనే గుండెపోటుతో మరణించినట్లుగా వైద్యులు నిర్ధారించారు. మరి ఇలాంటి ఉక్కపోత సమయంలో అధికారులు కూడా ఓటర్లకు కావలసిన వాటిని సమకూర్చి మరి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేస్తే ఓటర్లు కూడా మరింత ఓటు వేయడానికి ఆసక్తి కలిగించేలా ఉన్నారని చెప్పవచ్చు.. అయితే అధికారులు నిర్లక్ష్యం వల్లే ఓటర్లు సైతం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడక్కడ ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. ఓటింగ్ సమయంలో కూడా చాలామంది ఓటర్స్ ఇలాంటి తీవ్రమైన ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు.. మరి కొన్నిచోట్ల ఉద్రిక్తత గొడవలు కొట్లాటలు వంటివి ఏర్పడుతున్నాయి. ఈసీ అధికారులు మాత్రం ఇలాంటి వాటిపైన ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇవి మాత్రం ఆగడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: