చందమామ కోసం బాలయ్య బాబు.. అదే కారణం..??

murali krishna
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్ర పోషించిన లేడీ ఓరియెండెట్ మూవీ 'సత్యభామ' సినిమాపై చాలా క్రేజ్ ఉంది. ఇంతకాలం గ్లామరస్ పాత్రల్లో అదరగొట్టిన చందమామ కాజల్..యాక్షన్ రోల్‍లో చేసిన మూవీ ఎలా ఉంటుందోననే క్యూరియాసిటీ ఉంది. యంగ్ హీరో నవీన్ చంద్ర కీలక పాత్రలో నటించిన ఈ సినిమా మే 31న విడుదలకు రెడీ అవుతుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్లో భాగంగా మూవీ టీం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను గ్రాండ్గా ప్లాన్ చేసింది. మే 24న సత్యభామ ట్రైలర్ ఈవెంట్ను నిర్వహించబోతున్నారు.సత్యభామ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మరో రెండు రోజుల్లో మే 24వ తేదీన సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి జరగనుంది. హైదరాబాద్‍లోని ఐటీసీ కోహినూర్ హోటల్‍లో ఈ ఈవెంట్‍ను మూవీ టీమ్ నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (మే 22) అధికారికంగా వెల్లడించింది.క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ కోసం గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ వస్తున్నారంటూ సత్యభామ మూవీని నిర్మించిన ఆరమ్ ఆర్ట్స్ వెల్లడించింది. బాలకృష్ణ, కాజల్‍తో కలిపి ట్రైలర్ లాంచ్  ఈవెంట్‍కు పోస్టర్ చేసింది. మే 24న సత్యభామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో నందమూరి బాలకృష్ణ గర్జన చూసేందుకు రెడీగా ఉండండి అంటూ రాసుకొచ్చింది.గతేడాది భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ నటించారు. ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‍బస్టర్ అయింది. ఇప్పుడు సత్యభామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍కు బాలయ్య అతిథిగా హాజరవుతున్నారు.
సత్యభామ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కాజల్ నటిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్ అదిరిపోయింది. యాక్షన్ మోడ్‍లో చందమామ అదరగొట్టారు. సత్యభామ మూవీకి సుమన్ చిక్కల దర్శకత్వం వహించారు. గూఢచారి, మేజర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన శశి కిరణ్ తిక్కా ఈ చిత్రానికి స్క్రీన్‍ప్లే బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే, ఆయనే సమర్పిస్తున్నారు.సత్యభామ సినిమా ప్రమోషన్లను కాజల్ జోరుగా చేస్తున్నారు. కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఐపీఎల్ సందర్భంగా సన్‍రైజర్స్ హైదరాబాద్, కోల్‍కతా నైట్‍రైడర్స్ క్వాలిఫయర్-1 మ్యాచ్‍ సందర్భంగా స్టార్ స్టోర్స్ తెలుగు కామెంటరీ బాక్స్‌లోనూ సందడి చేశారు. ఆహా ఓటీటీలో సర్కార్ సీజన్ 4 గేమ్ షోలో కూడా పాల్గొన్నారు.సత్యభామ సినిమాలో కాజల్‍తో పాటు నవీన్ చంద్ర, ప్రకాశ్ రాజ్, నాగనీడు, హర్షవర్దన్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఆరమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్కా, శ్రీనివాసరావు తక్కలపల్లీ ఈ మూవీని నిర్మించారు.కాగా, బాలకృష్ణ ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ మూవీ  చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్బంగా గ్యాప్ తీసుకున్న బాలయ్య.. మళ్లీ షూటింగ్‍ మొదలుపెట్టేశారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్‍గా నటిస్తారని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా కూడా కీలకపాత్రలు చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: