పబ్ కల్చర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీకాంత్..!!

murali krishna
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫాంహౌస్‌ జరిగిన రేవ్ పార్టీ తెలుగు, కన్నడ సినీ-టీవీ వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది.ఈ పార్టీకి రెండు పరిశ్రమలకు చెందిన నటీనటులు, పలు రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం వీరంతా పోలీసుల అదుపులో ఉన్నారు.అయితే టాలీవుడ్‌కు చెందిన హీరో శ్రీకాంత్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ, కొరియోగ్రాఫ్ జానీ మాస్టర్ పేర్లు ఈ కేసులో వినిపించడంతో కలకలం రేపింది. ఆ వెంటనే వీరు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తాము ఆ రేవ్ పార్టీకి వెళ్లలేదని , మేం అలాంటి వాళ్లం కాదని వీడియో బైట్‌లు వదిలారు. మరి ఎవ్వరూ వెళ్లకపోతే.. ఇంతకీ దొరికినవారెవ్వరు అనే సందేహాలు కలుగుతున్నాయి.ఐతే దీనికి నటుడు శ్రీకాంత్ స్పందించి ఇలా అన్నారు.తాను పార్టీలకు, పబ్ లకు దూరంగా ఉండే వ్యక్తిని అని శ్రీకాంత్ తెలిపారు. కొన్నేళ్ల క్రితమే పబ్ కల్చర్ పై శ్రీకాంత్ కామెంట్స్ చేసారు. ఇప్పుడు రేవ్ పార్టీ నేపథ్యంలో ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇటీవల బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీ నేపథ్యంలో మరోసారి చిత్ర పరిశ్రమలో డ్రగ్స్, పబ్ కల్చర్ పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో కొందరు బడా బాబులు, చిత్ర పరిశ్రమలోని నటులు, నటీమణులు పాల్గొన్నారుట్లు తెలుస్తోంది.
ముందుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటి హేమపేరు వినిపించింది. ఆమె తాను హైదరాబాద్ లోనే ఉన్నానంటూ వీడియో రిలీజ్ చేసి బుకాయించడానికి ప్రయత్నించింది. కానీ ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. హీరో శ్రీకాంత్ లాగా పోలిన వ్యక్తి ఉండడంతో అతడి పేరు కూడా వినిపించింది. అయితే తాను ఎక్కడికి వెళ్లలేదని తన ఇంట్లోనే ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు.
తాను పార్టీలకు, పబ్ లకు దూరంగా ఉండే వ్యక్తిని అని శ్రీకాంత్ తెలిపారు. కొన్నేళ్ల క్రితమే పబ్ కల్చర్ పై శ్రీకాంత్ కామెంట్స్ చేసారు. ఇప్పుడు రేవ్ పార్టీ నేపథ్యంలో ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ ఊహని పెళ్లి చేసుకున్న తర్వాత ఇతర హీరోయిన్లతో అంతగా మాట్లాడేవాడిని కాదు అని శ్రీకాంత్ అన్నారు.ఎందుకంటే ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడలేను. మనకి వచ్చే హీరోయిన్లందరూ బాంబే నుంచే వస్తారు. వారితో ఇంగ్లీష్ మాట్లాడితే ఎక్కడైనా తప్పులు ఉంటాయోమో అని హాయ్ బై చెప్పేసి వెళ్ళిపోతా. ఎక్కువగా మాట్లాడను.నాకు పబ్ కల్చర్ అలవాటు లేదు. ఎవరన్నా పిలిచినా వెళ్లను. ఫ్యామిలీ ఫంక్షన్స్ కి హాజరవుతా. నా భార్యకి ఫ్యామిలీ మొత్తం కలసి పిక్ నిక్ వెళ్లడం చాలా ఇష్టం. అలాంటి సరదాలు ఉన్నాయి తప్ప.. పబ్ లకు పార్టీలకు వెళ్లే అలవాటు లేదని శ్రీకాంత్ కొన్నేళ్ల క్రితమే తెలిపారు.నా ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ కాకూడదు. అందుకే ఇతర వ్యవహారాలు పెట్టుకోను అని శ్రీకాంత్ అన్నారు. ఇక తాను ముగ్గురు పిల్లలని కనడానికి కూడా కారణాన్ని శ్రీకాంత్ వివరించారు. నేను అయితే ఇద్దరే అనుకున్నా. కానీ నా భార్య ఊహకి పిల్లలంటే చాలా ఇష్టం. మూడో బిడ్డ కూడా కావాలని కోరుకుంది. అందువల్ల ముగ్గురిని కన్నాం అని శ్రీకాంత్ మనసులో మాట బయట పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: