నితిన్ ఎక్స్ట్రా మూవీ ట్రైలర్ డేట్ లాక్..!!

Divya
టాలీవుడ్ లో హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నితిన్ శ్రీలీల కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఎక్స్ట్రార్డినరీ.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. అలాగే ఇందులో అలనాటి హీరో రాజశేఖర్ కూడా విలన్ తరహా పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. నితిన్ కెరియర్ లో ఈ సినిమా 32వ సినిమా .. శ్రేష్టు మూవీస్ పతాకం పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి భాగస్వామిగా నితిన్ తండ్రి కూడా నిర్మిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 8వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

ఎక్స్ట్రాడినరీ సినిమా నుంచి విడుదలైన పలు రకాల అప్డేట్ సైతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ని సైతం విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. రేపటి రోజున ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు నితిన్ ఒక ట్విట్టర్ రూపంలో తెలియజేశారు. నవంబర్ 27న మనం కుమ్మేద్దాం అంటూ తెలియజేశారు శ్రీ లీలతో కలిసి చిత్రీకరణలో దిగిన ఒక వీడియోను కూడా ఆయన షేర్ చేయడం జరిగింది.

ఎక్స్ట్రాడినరీ సినిమా కోసం దాదాపుగా 300 మంది డాన్సర్లతో పాటు నితిన్ శ్రీలీల హైదరాబాద్ నగరాలలో బారిసెట్ మధ్య డ్యాన్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా చేస్తున్నారు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. గతంలో కూడా టీజర్ ని విడుదల చేయక మంచి రెస్పాన్స్ లభించింది. అయితే ఇందులో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ రోల్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో నితిన్ క్యారెక్టర్జేషన్ మూవీ కాన్సెప్ట్ కామెడీ టైమింగ్ ప్లే చేయగలను కూడా ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. మరి ట్రైలర్ ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: