అతనికి 16 ఆమెకు 27.. ఓ రోజు ఏకాంతంగా?

praveen
ఇటీవల కాలంలో మగవాళ్ల కంటే ఎక్కువగా నేరాలు చేస్తున్నారు ఆడవాళ్లు. మోసం నేర్చిన మహిళలు ఎవరూ ఊహించని విధంగా క్రైమ్స్‌కు పాల్పడుతున్నారు. ఇటీవల ఓ పెళ్లయిన మహిళ ఓ ఇంట్లో అద్దెకి దిగి ఇంటి ఓనర్ కుమారుడినే తన వలలో వేసుకుంది. భర్త, ఇద్దరు పిల్లలిని గాలికి వదిలేసి 16 ఏళ్ల బాలుడితో చెన్నై పారిపోయింది. ఆ బాలుడితో ఇంట్లో ఉన్న నగదు, నగలు తెప్పించింది. తర్వాత అతడితో చెన్నైకు వెళ్లింది. అక్కడ ఐదు నెలల పాటు బాలుడిని శారీరకంగా వాడుకుంది. బాగా జల్సా చేశాక మళ్లీ ఇంటి దగ్గర దింపి అక్కడ నుంచి పరార్ అయ్యింది. సిద్దిపేటలో ఈ షాకింగ్ సంఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే, మూడేళ్ల క్రితం సిద్దిపేటలోని హనుమాన్‌నగర్‌లోని ఓ ఇంట్లో ఒక ఫ్యామిలీ దిగింది. ఈ ఫ్యామిలీలో భర్త, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సదరు భార్య ఇంటి యజమాని కొడుకుపై లైంగిక కోరికలు పెంచుకుంది. రోజూ అతడితో మాట్లాడుతూ చనువు పెంచుకుంది. చివరికి ఆ బాలుడిని లోబర్చుకుని శృంగారం చేయడం మొదలు పెట్టింది. కొద్ది రోజులకు అతడితో పగలు, రాత్రి తేడా లేకుండా గడపాలనే స్థాయికి చేరుకుంది. ఇదే విషయాన్ని ఆ బాలుడికి చెప్పింది. వేరే చోట బతకాలంటే డబ్బులు కావాలని, అందుకే ఇంట్లో ఉన్న క్యాష్, గోల్డ్ తేవాలని బాలుడికి చెప్పింది.
అయితే ఈ వివాహత చెప్పేది మొత్తం బాలుడు వినేశాడు. ఆమె చెప్పినట్లే నగలు, నగదు తీసుకొచ్చి ఆమెకి ఇచ్చేశాడు. అలా చేతిలో డబ్బులు పడగానే ఆమె వెంటనే భర్త, పిల్లలను వదిలేసి బాలుడుతో సహా చెన్నై చెక్కేసింది. జూన్ 22న మైనర్ బాలుడుతో కలిసి చెన్నై వెళ్లిన ఆమె అక్కడ నగలను అమ్మేసి బాగా జల్సా చేసింది. బాలుడిని శారీరకంగా వాడుకుంది. అయితే కొడుకు కనిపించకపోవడంతో ఇంటి ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేస్తున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఐదు నెలలుగా ఆ అబ్బాయి కోసం వెతుకుతున్నారు. చివరికి వివాహితతో ఉన్నట్లు గుర్తించారు.
తమ గురించి పోలీసులు గాలిస్తున్నారని సదరు వివాహిత తెలుసుకుంది. ఆ వెంటనే బాలుడిని సిద్దిపేటలోని ఇంటి వద్ద వదిలేసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు చాకచక్యంగా మహిళను పట్టుకొని అరెస్ట్ చేశారు. బాలుడు మైనర్ కాబట్టి మహిళపై పోక్సో కేసు ఫైల్ చేశారు. ఆపై రిమాండ్‌కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: