విజయ్ సీఎం అవ్వడం పై అసూయ లేదు.. రజనీకాంత్ కామెంట్స్..!
ఈరోజు మీడియా ముఖంగా రజనీకాంత్ ఈ విషయం పైన స్పష్టత ఇచ్చారు.. రజనీకాంత్ మాట్లాడుతూ రాజకీయాలలో విజయ్ సాధించిన విజయం గతంలో తమిళనాడులో ఎంజీఆర్, అటు ఆంధ్రాలో నందమూరి తారక రామారావు సాధించిన విజయాల కంటే చాలా పెద్దది అంటూ తెలిపారు. ఆ కాలంలో ఆ ఇద్దరు మహా నాయకులు ఎదుర్కొన్న రాజకీయ పరిస్థితుల కంటే ప్రస్తుతం ఉన్న ఈ రాజకీయ పరిస్థితులను విజయ్ ఎదుర్కొని నిలబడడం విశేషం అంటూ తెలియజేశారు.
కమలహాసన్ సీఎం అయితే అసూయపడతానని విజయ్ తనకు సమవుజ్జి కాదని, విజయ్ కి తనకు 25 ఏళ్ల తేడా ఉందని, ఒకవేళ తాను పార్టీ పెడితే కచ్చితంగా గెలిచే వాడినని, తనకు మాజీ సీఎం స్టాలిన్ కూడా మంచి స్నేహితుడే అని అందుకే ఓడిన తర్వాత కూడా వెళ్లి కలిశానని తెలియజేశారు రజనీకాంత్. విజయ్ సీఎం కాకుండా తాను ఎప్పుడూ కూడా అడ్డుపడలేదని అలాంటి నీచ రాజకీయాలను తాను చేయనంటూ కూడా తెలియజేశారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారు అందుకే విజయ్ గెలిచారు అంటూ తెలిపారు. గతంలో కూడా రజనీకాంత్ పార్టీ పెట్టాలని అధికారికంగా ప్రకటన కూడా చేశారు. ఈ విషయంపై అక్కడ ప్రజల నుంచి కూడా ఆయనకు మద్దతు భారీగానే లభించింది. అయితే కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల పార్టీ ప్రకటన పైన వెనక్కి తగ్గారు రజినీకాంత్.