వారిని టీమ్ ఇండియా నుంచి తీసెయ్యకపోతే.. వరల్డ్ కప్ టైటిల్ కష్టమే?

praveen
ప్రస్తుతం వెస్టిండీస్, యూఎస్ వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరుసగా మ్యాచ్ లలో విజయం సాధిస్తూ దూసుకుపోతుంది. వరల్డ్ కప్ లో ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ గెలవాలి అనే పట్టుదలను పెట్టుకున్న టీమిండియా ఆ దిశగా విజయవంతంగా అడుగులు వేస్తుంది. ఇప్పటివరకు వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా ఆడిన మూడు మ్యాచ్ లలో కూడా ఘనవిజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే అటు సూపర్ 8 లో కూడా అడుగు పెట్టింది అని చెప్పాలి

 అయితే ఇప్పుడు వరకు టీం ఇండియా ప్రస్థానం అంతా బాగానే సాగినప్పటికీ భారత జట్టులోని కొంతమంది ఆటగాళ్ల ఫామ్ మాత్రం అభిమానులందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తూ ఉంది అని చెప్పాలి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి కీలక ప్లేయర్లు కూడా ఇక స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు జట్టును ఎప్పుడూ కష్టాల్లో ఆదుకునే ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సైతం ఎక్కడ ఆకట్టుకోవడం లేదు. ఇలా టీమిండియా ఆటగాళ్లు ఏ మ్యాచ్ లో ఎవరు విఫలమవుతారు అని చెప్పడం కూడా కష్టతరంగా మారిపోయింది. అయితే సూపర్ 8 మ్యాచులలో మాత్రం అటు టీమిండియా తప్పకుండా జట్టులో మార్పులు చేయాల్సిందే అనే వాదనలు వినిపిస్తున్నాయి.

 అయితే టీమిండియా ఇప్పటివరకు ఏకంగా నాలుగు మ్యాచ్లు ఆడగా.. కొంతమంది ఆటగాళ్ళు ఇప్పటివరకు ఒక్కసారి కూడా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. బెంచ్ కి పరిమితమైన ఆటగాళ్లలో యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్, సంజు, కుల్దీప్ యాదవ్, చాహల్ లాంటి కీలకమైన స్టార్ ప్లేయర్లు ఉన్నారు అని చెప్పాలి. ఇక సూపర్ 8 మ్యాచ్లకు వీరిలో ఎవరైనా ముగ్గురిని ఆడించవచ్చు అని క్రికెట్ విశేషకులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే కోహ్లీ ఓపెనర్ గా విఫలమవుతున్న నేపథ్యంలో ఓపెనర్ గా జైశ్వాల్ ను బరిలోకి  దింపాలని అలా అయితే కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ కి వస్తాడని నిపుణులు అంచనా వేస్తున్నారు. జడేజాస్థానంలో కుల్దీప్, శివం దూబే స్థానంలోసంజూను తీసుకుంటే బెటర్ అని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: